KTR: హైడ్రాపై కేటీఆర్ ఫైర్.. ఏకంగా ఖర్గేకి..

కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పేదల ఇళ్లను కూల్చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై మాజీ మంత్రి, BRS నేత శ్రీనివాస్ గౌడ్ స్పందించిన విషయం తెలిసిందే. 


Published Aug 30, 2024 06:33:28 AM
postImages/2024-08-30/1725013154_Hydra.jpg

న్యూస్ లైన్ డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి సమీపంలోని ఆదర్శనగర్‌లో హైడ్రా అధికారులు ఇళ్లను కూల్చేసిన విషయం తెలిసిందే. అధికారులు తమ ఇళ్లను కూల్చేయడంతో చేసేదేమీ లేక.. ఇళ్లు కూల్చేసిన స్థలంలోనే టెంట్లు వేసుకొని ఉంటున్నారు. ఉన్నపళంగా ఇళ్లను కూల్చేస్తే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. 

ఇళ్లు లేక పోవడంతో పిల్లాజెల్లా రోడ్డునపడ్డామని వాపోతున్నారు. అయితే, ఇళ్లు కోల్పోయిన వారిలో అంధులు కూడా ఉన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పేదల ఇళ్లను కూల్చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై మాజీ మంత్రి, BRS నేత శ్రీనివాస్ గౌడ్ స్పందించిన విషయం తెలిసిందే. 

తాజగా, మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అంశంపై స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంలో మరో బుల్డోజర్ రాజ్ తయారు కాకుండా చూసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గేని కోరుతూ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలపై పదే పదే దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఇటీవల మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.  

మీరు చెప్పినట్లుగా, ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం,అన్యాయమని తెలిపారు. తెలంగాణలో చట్టం, న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర ధిక్కారంతో ఇటువంటి ఘటనలే జరుగుతున్నాయని వెల్లడించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని 75 పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎటువంటి నోటీసులు లేకుండా కూల్చేశారని వెల్లడించారు. 

ఈ నిరుపేదల్లో 25 కుటుంబాలు శారీరక దివ్యంగులు కూడా ఉన్నారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఆధునిక నాగరికతకు అసహ్యం కలిగేలా ఉన్నాయని ఆయన వెల్లడించారు. దేశంలోనే మరో బుల్డోజర్ రాజ్‌ని తయారు చేయొద్దని ఖర్గేని కేటీఆర్ కోరారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu brs ktr telanganam cm-revanth-reddy congress-government mahbubnagar mallikharjunakharge hydra

Related Articles