కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా పూర్తి కాకుండానే ప్రభుత్వానికి ఇంత భయమా అని విజయ్ కుమార్ ప్రశ్నించారు. రాబోయే ఐదేండ్లలో మేము ప్రజల పక్షాన చేసే లడాయి చూస్తే పాలకుల లాగులు తడుస్తయేమో అంటూ ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉద్యమ పార్టీ ఉంటే ప్రభుత్వానికి ముచ్చెముటలు పడుతున్నాయన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: పోలీసుల బైండోవర్స్, నిర్బంధాలు తమకు కొత్తేమీ కాదని వరంగల్ కాకతీయ యూనివర్సిటీ(Warangal Kakatiya University) విద్యార్థి పిన్నింటి విజయ్ కుమార్(Pinninti Vijay Kumar) అన్నారు. యూనివర్సిటీ విద్యార్థులను అరెస్ట్(students arest) చేయడంపై స్పందించిన ఆయన.. విద్యార్థుల తరఫున శనివారం ఓ వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా పూర్తి కాకుండానే ప్రభుత్వానికి ఇంత భయమా అని విజయ్ కుమార్ ప్రశ్నించారు. రాబోయే ఐదేండ్లలో మేము ప్రజల పక్షాన చేసే లడాయి చూస్తే పాలకుల లాగులు తడుస్తయేమో అంటూ ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉద్యమ పార్టీ ఉంటే ప్రభుత్వానికి ముచ్చెముటలు పడుతున్నాయన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) పర్యటించనున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషలిటీతో పాటు వరంగల్ టెక్స్టైల్ పార్క్ను సందర్శించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దీనిపై స్పందించిన వినయ్ కుమార్.. ఇది ప్రజా ప్రభుత్వమే అయితే, మీ వరంగల్ జిల్లా పర్యటనకు ఇంత పోలీసు పహారా ఎందుకు..? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. యూనివర్సిటీ విద్యార్థుల అక్రమ అరెస్టులు చూస్తే అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో రాబందుల పాలన నడుస్తుందని తెలిపారు. వారి అక్రమ అరెస్టులను యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని విజయ్ కుమార్ తెలిపారు.