baton charge video: బీజేపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్

సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఘర్షణలను, హింసను ప్రేరేపించే వారు హిందూయిజం మౌలిక సూత్రాలను అర్థం చేసుకోలేరని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌లను ఆదేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుండి కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. 


Published Jul 04, 2024 05:57:31 AM
postImages/2024-07-04/1720089820_modi26.jpg

న్యూస్ లైన్ డెస్క్: గురువారం బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇటీవల పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన పలు వ్యాఖ్యలు మతపరంగా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఘర్షణలను, హింసను ప్రేరేపించే వారు హిందూయిజం మౌలిక సూత్రాలను అర్థం చేసుకోలేరని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌లను ఆదేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుండి కూడా తొలగించాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. 

మరోవైపు రాహుల్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ గాంధీకి జేబీపీ శ్రేణులు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి బీజేపీ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. 

కార్యకర్తల ఆందోళనలను ఆపి పరిస్థితిని దుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. దిష్టి బొమ్మను లాక్కొని, బారికేడ్లు పెట్టి కార్యకర్తలను అడ్డుకున్నారు. అయినప్పటికీ కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసుల లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో బీజేపీ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

newsline-whatsapp-channel
Tags : telangana newslinetelugu congress telanganam bjp rahul-gandhi parliament nampally bjp-office

Related Articles