రాజ్ తరుణ్ తనను వదిలేసి వెళ్లిపోయాడంటూ షార్ట్ ఫిలిం నటి లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గత కొన్ని రోజులు గా హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదం జరుగుతూనే ఉంది. హీరో రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్ తరుణ్ వెంటనే ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడి రాజ్ తరుణ్ తనను వదిలేసి వెళ్లిపోయాడంటూ షార్ట్ ఫిలిం నటి లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఆరోపణలకు తగిన ఆధారాలు అందించాలని పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు.లావణ్య పోలీసులకు 170 ఫొటోలను, పలు టెక్నికల్ ఆధారాలను అందించారు. దాంతో రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సెక్షన్ 493, తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కూడా అప్లై చేశారు.
లావణ్య అలియాస్ అన్విక అనే పేరుతో కలిసి విదేశాలకు కూడా వెళ్లామని చెప్పారు. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని లావణ్య తెలిపారు. ఈ అబార్షన్ విషయం రుజువు కూడా చెయ్యగలనని చెబుతుంది లావణ్య..ప్రస్తుతానికి ఈ కేసు రేపటికి వాయిదా వేశారు. రేపు ఈ కేసు ఏమవుతుందనేది సర్వత్రా ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అంతేకాదు రాజ్ తరుణ్ తల్లితండ్రులు , కలిసి లావణ్య తమపై దాడికి ప్రయత్నించిందని ..తమను కాపాడాలని మాదాపూర్ పోలసులకి ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ తమ పేరెంట్స్ ఇద్దరికి..ఆరోగ్యసమస్యలున్నాయని ..వారిని ఇలా ఇబ్బందిపెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు తమను పోలీసులు కాపాడాలని కోరారు.