IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్‌గా జహీర్ ఖాన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ మెనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. లక్నో మెంటర్‌గా భారత సీనియర్ బౌలర్ జహీర్ ఖాన్‌ను నియమించింది.


Published Aug 28, 2024 06:36:23 AM
postImages/2024-08-28/1724844666_mentor.PNG

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ మెనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. లక్నో మెంటర్‌గా భారత సీనియర్ బౌలర్ జహీర్ ఖాన్‌ను నియమించింది. ఈ విషయాని లక్నో ఫ్రాంఛైజీ బుధవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. గౌతమ్ గంభీర్ స్థానంలో అతన్ని నియమిస్తున్నట్లు తెలిపారు. కోల్‌కతాలో జరిగిన ఈవెంట్‌లో జహీర్ జెర్సీని లాంచ్ చేశారు. అయితే గత సీజన్‌లో లక్నోకు గంభీర్ మెంటర్‌గా ఉన్నారు. కాగా, ఇటివల గౌతమ్ గంభీర్ భారత హెడ్ కోచ్ కావడంతో ఖాన్‌కు ఈ అవకాశం దక్కింది.

‘‘కింగ్ ఆఫ్ రివర్స్ స్వింగ్, ఇండియన్ లెజెండ్ జహీర్ ఖాన్ లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గా బాధ్యతలు తీసుకున్నాడు’’ అనే క్యాప్షన్‌తో ఫ్రాంఛైజీ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. జహీర్ ఖాన్ ఐపీఎల్ కెరీర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. మొత్తంగా 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ముంబైకి కోచింగ్ స్టాఫ్‌గా పనిచేశాడు. ఇప్పుడు మెంటార్ అవ‌తారంలో కనిపించబోతున్నాడు. 

Related Articles