ఆయన సోనూ సూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు. అయితే ఎన్ని సార్లు సమన్లు పంపినా ..సోనూసూద్ రెస్పాండ్ కాలేదు .
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బాలీవుడ్ నటుడు సోనూసూద్ పై పంజాబ్ లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. మోహిత్‌శర్మ అనే వ్యక్తి రిజికా కాయిన్ పేరుతో తనతో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్‌ఖన్నా కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో ఆయన సోనూ సూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు. అయితే ఎన్ని సార్లు సమన్లు పంపినా ..సోనూసూద్ రెస్పాండ్ కాలేదు .
విచారణ చేపట్టిన న్యాయస్థానం సోనూ సూద్‌కు పలుమార్లు సమన్లు పంపినా ఆయన హాజరు కాకపోవడంతో ...అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలంటూ లుథియానా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రమన్‌ప్రీత్ కౌర్ నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తరువాత విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశారు.
కాగా, సోనూ సూద్ ఇటీవలే డైరెక్టర్‌గా మారారు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘ఫతేహ్’ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సైబర్ మాఫియా ఆధారంగా కథతో సినిమా తీశారు. హిట్ టాక్ తో సోనూ సూద్ ఫుల్ బిజీ అయిపోయారు.