మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లు ఎంతలా లైంగిక వేధింపులకు గురి అవుతున్నారో వివరిస్తూ.. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు వెల్లడించింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇండస్ట్రీలో చిన్న చిన్న ఆర్టిస్టులకే ఈ క్యాస్టింగ్ కౌచ్ , లైంగిక వేధింపులు అన్నీ..పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఎవ్వరికి ఈ ఇబ్బందులు ఉండవు అనుకుంటాం..కాని వాళ్లకి ఈ తిప్పలు తప్పవంటున్నారు మంచులక్ష్మి. ఇక తాజాగా మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లు ఎంతలా లైంగిక వేధింపులకు గురి అవుతున్నారో వివరిస్తూ.. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు వెల్లడించింది. దీనిలో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి.
దీనిపై మంచు లక్ష్మి స్పందించారు. కెరీర్ ప్రారంభంలో తనను కూడా వేధించారని చెప్పుకొచ్చింది. మోహన్ బాబు లాంటి స్టార్ హీరో కుమార్తె అయిన మంచు లక్ష్మికి కూడా వేధింపులు తప్పలేదంటే.. ఇండస్ట్రీలో ఎంత భయంకర పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఈ వార్త తెలిసిన వారు. నిజానికి మంచుఫ్యామిలీ ఇండస్ట్రీలో చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్లింట్లో ఆడవారిని టచ్ చేసేంత ధైర్యం ఎవ్వరికి లేదు. కాని మంచులక్ష్మీ ని కూడా టచ్ చేస్తున్నారంటే ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందో అంటున్నారు నెటిజన్లు.ఇది కూడా ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.
మంచు లక్ష్మి మాట్లాడుతూ..‘‘మీకో విషయం చెబుతాను. జీవితంలో మహిళలకే అన్యాయ జరుగుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా.. సరే బాధితులు అంటే మహిళలే. మనం దాన్ని ఎలా మార్చగలం.. మీకు మీరే పోరాడాలి. కెరీర్ ప్రారంభంలో నన్నూ పడేయాలని చూశారు. కానీ నేను నిలబడ్డాను. కొన్ని కోల్పోయి ఉండొచ్చు. కానీ నా వెంట పడుతున్న వ్యక్తికి నేను ఎదుగుతున్నానని తెలుసు’’ అలా ప్రతి అమ్మాయి ...మిమ్మల్ని కాపాడుకోవడం నేర్చుకొండి.ఎవరిపైనా ఆధారపడకండి అంటూ చెప్పింది.