Chiranjeevi: అఖిల్ చిత్రాన్ని అడ్డుకుంటున్న మెగాస్టార్.. కారణం.!

అక్కినేని అఖిల్  గట్టి హిట్ కోసం ఎదురుచూస్తున్నటువంటి యంగ్ హీరో. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ  ఇప్పటికీ సెట్ అవ్వడం లేదు.  ప్రస్తుతం అఖిల్ కంటే వెనుక వచ్చినటువంటి చాలామంది హీరోలు ఇప్పటికే ఇండస్ట్రీలో సెట్ అయిపోయారు. కానీ అఖిల్ కు ఏ సినిమా కూడా  భారీ హిట్ ఇవ్వడం లేదు.  దీంతో మంచి కథ, అత్యధిక బడ్జెట్ తో ఒక సినిమా చేయాలని అఖిల్  ట్రై చేస్తున్నాడు.  అయితే యూవి క్రియేషన్స్ పై  ఒక చిత్రం వస్తుందని గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. దాదాపుగా దీని బడ్జెట్ 100 కోట్ల దాకా ఉంటుందట.


Published Jul 26, 2024 06:52:57 AM
postImages/2024-07-26/1721992975_akhil.jpg

న్యూస్ లైన్ డెస్క్: అక్కినేని అఖిల్  గట్టి హిట్ కోసం ఎదురుచూస్తున్నటువంటి యంగ్ హీరో. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ  ఇప్పటికీ సెట్ అవ్వడం లేదు.  ప్రస్తుతం అఖిల్ కంటే వెనుక వచ్చినటువంటి చాలామంది హీరోలు ఇప్పటికే ఇండస్ట్రీలో సెట్ అయిపోయారు. కానీ అఖిల్ కు ఏ సినిమా కూడా  భారీ హిట్ ఇవ్వడం లేదు.  దీంతో మంచి కథ, అత్యధిక బడ్జెట్ తో ఒక సినిమా చేయాలని అఖిల్  ట్రై చేస్తున్నాడు.  

అయితే యూవి క్రియేషన్స్ పై  ఒక చిత్రం వస్తుందని గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. దాదాపుగా దీని బడ్జెట్ 100 కోట్ల దాకా ఉంటుందట.  దీనికి దర్శకుడుగా అనిల్ ఉంటారని  వార్తలు వినిపిస్తున్నాయి.  అంతేకాదు ఈ వీరిద్దరి కాంబోపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది.  ఈ పాత్ర కోసం అఖిల్ కూడా వర్కౌట్స్ చేస్తున్నారని, ఇంకోవైపు కథకు మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయని  తెలుస్తోంది.

కానీ ఈ చిత్రానికి చిరంజీవి  కాస్త అడ్డుగా ఉన్నట్టు  సమాచారం. యూవీ క్రియేషన్స్ పై చిరంజీవి 'విశ్వంభర' సినిమా తెరకేక్కుతోంది. దాదాపుగా ఈ చిత్రానికి 150 కోట్ల బడ్జెట్ పెట్టారట. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అన్ని అనుకున్నట్టుగా జరిగితే లాభాలు వస్తే, ఇదే బ్యానర్ లో అఖిల్ సినిమా స్టార్ట్ అవుతుందట. అందుకే అఖిల్ సినిమా ఇన్నాళ్ళ నుంచి వాయిదా పడుతూ  వస్తోందని  తెలుస్తోంది.

చిరంజీవి కూడా సోషియో ఫాంటసీ  కథతో వస్తున్నారు కాబట్టి యూవీ క్రియేషన్స్ వారు కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వారు అనుకున్నట్టు అన్నీ ఓకే అయితే మాత్రం  అఖిల్ సినిమా తెరికెక్కే అవకాశం ఉంది.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu akhil-akkineni vishwambhara uv-creations

Related Articles