గాస్టార్ చిరంజీవి సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయల చెక్ స్వయంగా వెళ్లి కేరళ సీఎం పినరయి విజయన్ కి అందించారు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి వయనాడ్ బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.
న్యూస్ లైన్ డెస్క్ : వయనాడ్ లో జరిగిన ప్రకృతి వైపరీత్యానికి వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. వందలాది ప్రాణాలు పోయాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటులు వయనాడ్ బాధితులకు అండగా నిలిచారు.తమవంతు బాధ్యతగా సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయల చెక్ స్వయంగా వెళ్లి కేరళ సీఎం పినరయి విజయన్ కి అందించారు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి వయనాడ్ బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. చిరంజీవి స్వయంగా వెళ్లి విరాళం అందించి తన పెద్ద మనసును చాటుకున్నారు.
కేరళలోని వాయనాడ్ లో ప్రకృతి సృష్టించిన బీభత్సానికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దేవభూమిగా పిలవబడే కేరళ నిత్యం ప్రకృతి విపత్తులతో తల్లడిల్లుతోంది. తాజాగా కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడమే గాక.. చాలామంది ఆచూకీ కూడా తెలియలేదు. భవనాలు కూలిపోయి ఎంతోమంది సజీవ సమాధి అయ్యారు. భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.