బ్యాంకు నుంచి అందిన ప్రతి ఖాతాదారునికి వారి అర్హత బట్టి రుణ మాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుతానిది అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: బ్యాంకు నుంచి అందిన ప్రతి ఖాతాదారునికి వారి అర్హత బట్టి రుణ మాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుతానిది అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఇప్పటికి కేవలం రెండు లక్షల వరకు కుటుంబ నిర్దారణ జరిగిన ఖాతాదారులందరికి పధకాన్ని వర్తింప చేసామని తెలిపారు. 2 లక్షల లోపు మిగిలి ఉన్న ఖాతాలకు కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా చెల్లిస్తామని అన్నారు. 2 లక్షల పైన ఉన్న ఖాతాలకు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వారు ముందు 2 లక్షల కంటే అదనంగా పొందిన రుణాన్ని చెల్లించిన పిదప, అర్హత బట్టి చెల్లిస్తామని వెల్లడించారు. బ్యాంకర్లు నుంచి వచ్చిన డేటా తప్పుగా వివరాలు ఉన్న రైతుల వివరాలును కూడా రైతుల వద్దనుండి సేకరిస్తున్నామని తెలిపారు.
రుణ మాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాల్సిందిగా బ్యాంకర్లను కోరామని ఆయన తెలిపారు. అందరికి సమాచారం కోసం ఈ ప్రభుత్వ రుణమాఫీ వివరాలు మీకు అందిస్తున్నామన్నారు. రుణమాఫీతో ప్రయోజనం ఏ మేరకు జరిగిందో ప్రజలు తీలుసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 31000 కోట్లు నిధులు కేటాయించుకొని, ఆర్థిక పరిస్థితులు లోను ఆగస్టు 15 లోపు 18000 కోట్లతో 2 లక్షల లోపు కాంగ్రెస్ ప్రభుత్వం రుణ మాఫీ చేసిందని మంత్రి తుమ్మల తెలిపారు.