Tummala: సాగు నీటి కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్‌దే

పాలేరు నియోజకవర్గంలో సాగు నీటి కష్టాలు తీర్చిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు అన్నారు.


Published Aug 13, 2024 03:12:00 PM
postImages/2024-08-13/1723542120_paleru.PNG

న్యూస్ లైన్ డెస్క్: పాలేరు నియోజకవర్గంలో సాగు నీటి కష్టాలు తీర్చిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు అన్నారు. మంగళవారం పాలేరులో మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పాలేరు నీటి కష్టాలు తీర్చాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యం కాలేదన్నారు. ఆనాడు ఉమ్మడి పాలనలో తాగడానికి నీళ్లు లేక చుట్టాల ఇంటికి పోయే పరిస్థితి ఉండేదని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు పాలేరు రూపురేఖలు మారిపోయాయి అన్నారు. ఆనాడు పశువులకు తాగడానికి నీళ్లు లేక ఊర్లు వదిలి వెళ్లిపోయే పరిస్థితి ఉండేదిని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఆనాడు సీఎం కేసీఆర్‌ను ఒప్పించి 76 వేల ఎకరాలకు సాగు నీరు వచ్చేలా చేశానని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. 

newsline-whatsapp-channel
Tags : india-people minister tummalanageswararao

Related Articles