Danam: మహా గణపతి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం

ఖైరతాబాద్ మహా గణపతి పనులు చురుకుగా కొనసాగుతున్నాయి అని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-17/1721210439_danam.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఖైరతాబాద్ మహా గణపతి పనులు చురుకుగా కొనసాగుతున్నాయి అని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ ఏడాది గణేష్ నవరాత్రుల ను వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే మహా గణపతి పనులను పరిశీలించారు. ఈ ఏడాది 70 సంవత్సరం కావడంతో మరింత ఘనంగా ఏర్పాట్లు చేస్తామని, ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ్ కమిటీ మధ్య విభేదాల నేపథ్యంలో అడ్ హాక్ పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేసామన్నారు. రెండు కమిటీ ఆలోచనలను పెరిగినలోకి తీసుకున్నామని, అందరు ఉత్సవ కమిటీ సభ్యులే అని తెలిపారు. ఉత్సవ కమిటీని 5 విభాగాలుగా చేసి ఉత్సవాలు నిర్వహించేలా బాధ్యతలు అప్పగిస్తామని, డొనేషన్స్ నుండి వచ్చే డబ్బును రోజు డిస్ప్ల్య్ చేస్తామన్నారు. విద్యా, ఆర్థిక స్థోమత లేని వారికీ సహాయం అందిస్తామని తెలిపారు. 

మల్టి పర్పస్ కమ్మూనిటి హాల్ కట్టబోతున్నామని, ఇక్కడ ఖైరతాబాద్ వాసులు నామినల్ ఫీ కట్టి హాల్‌ను వినియోగించుకొనేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. కొత్త కమిటీలో రాజ్ కుమార్ చైర్మన్ ఉంటారు. 100 మందితో అడ్ హాక్ ఉత్సవ్ కమిటీలో సభ్యులు ఉంటారని, కమిటీ సబ్యులకు ఐడి కార్డు ఉంటుందన్నారు. ఎన్నారైస్ కోసం డైరెక్ట్ గా వచ్చి దర్శనమ్ చేసుకునేందుకు ఏర్పాటు చేశామన్నారు. రోజు ప్రసాదాలు పంపిణి చేస్తామని, పోలీసులు, మీడియా, వాలెంటర్స్ కు భోజనాలకు ఏర్పాట్లకు చేస్తున్నామని తెలిపారు. బోనాల ఫెస్టివల్ తర్వాత దూప దీపాలు లకు నోచుకోని అన్ని టెంపుల్స్ కి కమిటీలు ఏర్పాటు చేయబోతున్నామని దానం నాగేందర్ పేర్కొన్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana khairtabad danamnagender

Related Articles