కేంద్ర భారీ పరిశ్రమలు, స్టీల్ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు కుత్బుల్లాపూర్ లోని హెచ్ఎంటీ పరిశ్రమను సందర్శించగా గత కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న హెచ్ఎంటి ఎంప్లాయిస్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ కేంద్ర మంత్రి కుమారస్వామిని కోరారు.
న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర భారీ పరిశ్రమలు, స్టీల్ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు కుత్బుల్లాపూర్ లోని హెచ్ఎంటీ పరిశ్రమను సందర్శించగా గత కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న హెచ్ఎంటి ఎంప్లాయిస్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ కేంద్ర మంత్రి కుమారస్వామిని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులతో ఎమ్మెల్యే మాట్లాడారు. 1992 నుంచి ఉద్యోగులకు ఇవ్వాల్సిన అనేక రకమైన బకాయిలను నేటికీ చెల్లించలేదన్నారు. అదేవిధంగా ఉద్యోగులకు అందాల్సిన పిఎఫ్, ఎర్న్డ్ లీవ్స్ (ఈఎల్) ఎన్ క్యాష్మెంట్ వెంటనే చెల్లించాలని కోరారు. 2019 నుంచి ఉద్యోగులకు అందాల్సిన గ్రాట్యుటీ ఇప్పటికీ అందలేదన్నారు. రిటైర్మెంట్ సమయంలో దాదాపు 600 మంది ఉద్యోగులు తమకు అందాల్సిన బకాయిలు ఉందని, ఇప్పటికే పలువురు ఉద్యోగులు మృతిచెందగా వారి కుటుంబాలు రోడ్డున పడి అవస్థలు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులకు అందాల్సిన బకాయిలతో పాటు అన్ని పాటు అన్ని సదుపాయాలను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంటి సీఎండీ రాజేష్ కోహ్లీ, వర్కర్స్ అండ్ స్టాఫ్ యూనియన్, హెచ్ఎంటి రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.