ఏ మొహం పెట్టుకొని సబితా ఇంద్రారెడ్డిపై అసెంబ్లీకి వచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆలోచన రహితంగా మాట్లాడారని ఆమె అన్నారు. దీనిపై స్పందించిన సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: BRS ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి వెళ్లారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి BRS ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెనకాల ఉండే అక్కలు.. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలరంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆ అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన సబితా.. తనను ఎద్దేశించే రేవంత్ ఆ మాటలు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తనను టార్గెట్ చేసారని ఆమె మండిపడ్డారు.
అంతేకాకుండా, ఏ మొహం పెట్టుకొని సబితా ఇంద్రారెడ్డిపై అసెంబ్లీకి వచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆలోచన రహితంగా మాట్లాడారని ఆమె అన్నారు. దీనిపై స్పందించిన సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. మహిళలకు అసెంబ్లీలో ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆమె ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డిని తన సొంత తమ్ముడిగా భావించానని అన్నారు. బుధవారం అసెంబ్లీలో జరిగిన విషయం మహిళా ఎమ్మెల్యేలకే అవమానకరం కాదు. రాష్ట్రంలోని మహిళలు అందరికీ అవమానకరమని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ BRS ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి వెళ్లారు.