Smitha Sabharval : స్మితా సభర్వాల్ పై జీవన్ రెడ్డి ఫైర్.. అసలు సర్కార్ ఏం చేస్తోంది?

దివ్యాంగులను కించ పరిచేలా ఐఏఎస్ స్మితా సభర్వాల్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆమెపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Published Aug 01, 2024 07:04:27 AM
postImages/2024-08-01/1722512743_JeevanReddyfiresonSmithaSabharwal.jpg

 

న్యూస్ లైన్ డెస్క్ : ఐఏఎస్ నియామకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ మీద కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో మాట్లాడిన ఆయన.. దివ్యాంగులను కించపరిచేలా.. ఒక సీనియర్ అధికారి మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. వారిని కించపరిచేలా.. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా పదే పదే మాట్లాడటంపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు.

స్మితా సభర్వాల్ మొత్తం రిజర్వేషన్ వ్యవస్థనే అవమానించారని, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విధానాన్ని ఆమె సవాల్ చేసినట్టు మాట్లాడారని జీవన్ రెడ్డి అన్నారు. దివ్యాంగులను, ప్రభుత్వ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడితే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా.. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు అని.. మండలి ద్వారా ప్రభుత్వానికి వినతి పంపాలని ఆయన కోరారు.

newsline-whatsapp-channel
Tags : india-people ts-news newslinetelugu viral-news jeevanreddy cm-revanth-reddy latest-news news-updates smithasabarwal

Related Articles