Mlc: వలస కూలీపైకి దూసుకెళ్లిన తీన్మార్ మల్లన్న కారు

తీన్మార్ మల్లన్న కారు ఓ నిరుపేద వలస కూలీ ప్రాణాలు బలి తీసుకుంది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు.. ఓ కుటుంబానికి అన్యాయం చేసింది. 


Published Jul 19, 2024 05:22:38 AM
postImages/2024-07-19//1721380332_TeenmarMallannaCar.jpg

న్యూస్ లైన్ డెస్క్: తీన్మార్ మల్లన్న TS 30 J 7200 కారు గురువారం సాయంత్రం ఓ వలస కార్మికుడి ప్రాణాలు తీసింది. ఈ కారు తీన్మార్ మల్లన్న ప్రధాన ఆనుచరుడు కాసుల అంజేయులు గౌడ్ కుటుంబ సభ్యులైన కాసుల తులసి పేరుతో ఉంది. ఈ కేసు నుండి తప్పించాలని తీన్మార్ మల్లన్నను, అతని అనుచరులను తప్పించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కార్యాలయం నుండి పోలీసులకు ఫోన్లు చేసి వత్తిడి చేస్తున్నారు. ఈ యాక్సిడెంట్ కు సంభందించిన సీసీ ఫుటేజీలను కూడా పోలీసులు బహిర్గతం చేయడం లేదు. ఈ యాక్సిడెంట్ తీన్మార్ మల్లన్న చేయడంతోనే పోలీసులు గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తుంది. గురువారం సాయంత్రం 6 గంటలకు TS 30 J 7200 గల మహీంద్రా తార్ కారును జోడిమెట్ల వద్ద రాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పక్కన వెళ్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉదేశ్ (32) అనే వ్యక్తిని జోడిమెట్ల వద్ద యాక్సిడెంట్ చేయడం తో తీవ్ర గాయాలు అయిన ఉదేశ్ ను మొదట సమీపంలోని నీలిమా హాస్పిటల్ కు, అక్కడి నుండి గాంధీ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో ఉదేశ్ మృతి చెందారు. 

 

ఈ కారు తీన్మార్ మల్లన్నకు బినామీగా ప్రచారంలో ఉన్న ఆంజనేయులు గౌడ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులది అని బాధిత కుటుంబం ఆరోపించింది. మాట్లాడుదాం అని వచ్చిన అంజనేయులు గౌడ్ పోచారం ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్ కు వచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగాడు. ఏమి పీక్కుంటారో పీక్కోండి, ప్రభుత్వమే మాది అంటూ తమపై దుర్భాశలు ఆడారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే అంజనేయులు గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి తో తీన్మార్ మల్లన్నతో కలిసి ఉన్న ఫోటోలు చూపించి పోలీసులపై వత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.

ఈ కారునిబంధనలకు విరుద్దంగా నంబర్ ప్లేట్ కలిగి ఉన్నందుకు గురువారం మధ్యాహ్నం ఈ కారుపై రూ.200 ట్రాఫిక్ చాలాన కూడా జనరేట్ అయ్యింది. అయ్యా తీన్మార్ మల్లన్న మీరే ఆ కారు నడిపారని కూడా ప్రచారం జరుగుతోంది.

అది ఎంత వరకు నిజం, ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు అనేది మీరే స్వయంగా వెల్లడించడం తో పాటు పొట్ట చేతపట్టుకొని మధ్యప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రానికి వలన వచ్చిన ఉదేశ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాము. ఉదేశ్ కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.

newsline-whatsapp-channel
Tags : india-people kill

Related Articles