రైతు రుణమాఫీలో నియమ నిభందనలు ఎందుక అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిలదీశారు.
న్యూస్ లైన్ డెస్క్: రైతు రుణమాఫీలో నియమ నిభందనలు ఎందుక అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిలదీశారు. మంగళవారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీకి ఇన్ని నిభందనలు ఎందుకు అని, నియమ నిబంధనలే రైతు మెడలకు ఉరితాళ్ళు గా మారుతున్నాయి. రైతుల చావులకు కారణమవుతున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసలు చదువుకున్నారా అని ఈటల ప్రశ్నించారు. మూడున్నర ఎకరాలకు పైగా వరి పొలం ఉంటే రుణ మాఫీ రాదు. 7 ఎకరాలు మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు, రేషన్ కార్డు లేకుంటే రుణ మాఫీ రాదని తెలిపారు. ఏడు ఎకరాలు పైబడి ఉంటే రుణ మాఫీ లేదని, రేషన్ కార్డు ప్రామాణికంగా రైతులను నిలువునా మోసం చేయడమే అని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక చేయాలని ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.