ఆ ఎమ్మెల్యే వ్యవహారం వల్ల మును "గోడు"తో తల్లడిల్లుతోందా.?

మైండ్‌లో ఏదీ అనిపిస్తే బ్లైండ్ గా అది చేసేస్తా అంటున్నారట మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. దీంతో ఆయన వ్యవహారం ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో హాట్ టాఫిక్ గా మారిందట. ఆయన చేస్తున్న


Published Sep 18, 2024 12:18:00 PM
postImages/2024-09-18/1726640020_rajagopal.jpg

న్యూస్ లైన్ డెస్క్: మైండ్‌లో ఏదీ అనిపిస్తే బ్లైండ్ గా అది చేసేస్తా అంటున్నారట మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. దీంతో ఆయన వ్యవహారం ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో హాట్ టాఫిక్ గా మారిందట. ఆయన చేస్తున్న పనులకు పబ్లిక్,  వ్యాపారులు పరేషాన్ అవుతున్నారట. తెలిసి చేస్తున్నాడో.. తెలియక చేస్తున్నడో అర్థం కావడం లేదని తలలు పట్టుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గంలో బెల్టు షాపులు లేకుండా చేస్తానని మాట హామీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. ఎన్నికల్లో గెలిచి 10 నెలలు దాటినా ఆ మాట మాత్రం నిలబెట్టుకోలేకపోతున్నారట. పైగా దీంట్లోనూ ఆయన పాలిటిక్స్ చేస్తున్నారట.

ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గం మొత్తం బెల్టు షాపులు క్లోజ్ చేయించాల్సింది పోయి కేవలం ప్రతిపక్షపార్టీలకు చెందిన బెల్టు షాపులనే క్లోజ్ చేయించారనే ఆపవాదును మూటగట్టకున్నారని నియోజకవర్గంలో టాక్. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి బెల్ట్ షాపులు మాత్రం యధేచ్చగా నడుస్తున్నాయని అంటున్నారు. నియోజవర్గంలో బెల్టు షాపులు క్లోజ్ చేయించకపోవడంతో మహిళలు సైతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయి. బెల్టు షాపులు ఎందుకు క్లోజ్ చేయించడం లేదని నిలదీసిన రోజులు ఉన్నాయి. ఇలా ఆయన పర్యటనకు వెళ్లిన ప్రతీ ఊరిలో బెల్టు షాపులపై మహిళలు ప్రశ్నిస్తున్నారట.

దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఇప్పుడు ఓ కొత్త డ్రామాకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది. బెల్టు షాపులు క్లోజ్ చేయించలేక, వైన్స్ షాపుల్లోని పర్మిట్ రూమ్ లపై పడ్డారని నియోజవర్గంలోని వైన్స్ షాపులవాళ్లు లబోదిబోమంటున్నారు. మునుగోడులో ఇటీవల పర్యటించిన రాజగోపాల్ రెడ్డి సడెన్ గా ఓ వైన్ షాపులోకి వెళ్లారు. పర్మిట్ రూంలోకి వెళ్లి అక్కడ మందు తాగుతున్నవారికి క్లాస్ పీకారు. అక్కడ మందు తాగుతున్నవారిని అక్కడి నుంచి దగ్గరుండి మరి వెళ్లాగొట్టారు. అంతేకాదు వైన్ షాపులో ఉన్న సిబ్బందిని పిలిచి పర్మిట్ రూంను క్లోజ్ చేసుకోవాలని చెప్పారు. సాయంత్రం 6గంటల తర్వాతే ఓపెన్ చేయాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై అక్కడి వైన్ షాపు యజమానులు మండిపడుతున్నారట. ప్రభుత్వానికి లక్షల రూపాయలు పన్ను కట్టి వైన్ షాపులు, పర్మిట్ రూంలకు పర్మిషన్ తీసుకున్నామని.. ఇలా వచ్చి మూసేయాలంటే తామేం కావాలని తలలు పట్టుకుంటున్నారట.

గవర్నమెంట్ ఏ రూల్ తీసుకురాకపోయినా ఎమ్మెల్యే అత్యుత్సాహంతో తాము నిండా మునిగే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్ర మంతా ఒక రూల్.. మునుగోడులో మరో రూల్ ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారట.  పర్మిట్ రూంలో సాయంత్రం వరకు ఓపెన్ చేయొద్దని చెప్పడమంటే బెల్టు షాపులను ప్రోత్సహించడమే అవుతుందని అంటున్నారట. మరోసారి పర్మిట్ రూంలు క్లోజ్ చేయాలని చెబితే నేరుగా ప్రభుత్వ పెద్దల దగ్గరికే వెళ్లాలని నియోజకవర్గంలోని వైన్ షాప్ ఓనర్లు డిసైడయ్యారట.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mla congress komatireddy-rajagopal-reddy komatireddyvenkatreddy munugodu wine-shops

Related Articles