Modi: మోడీది మొసలి కన్నీరు

మోడీ ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైంగిక వేధింపులపై పోరాటం చేసిన సమయంలో స్పందించని మోడీ.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు.


Published Aug 07, 2024 06:36:49 AM
postImages/2024-08-07/1723028617_modi2.PNG

న్యూస్ లైన్ డెస్క్: బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ వినేశ్ ఫోగట్‌కు ఫైనల్‌లో అర్హత సాధించిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వినేష్ నువ్వు ఛాంపియన్లలో ఛాంపియన్! మీరు భారతదేశానికి గర్వకారణం, ప్రతి భారతీయునికి స్ఫూర్తి. ఈరోజు ఎదురుదెబ్బ బాధిస్తుంది. నేను అనుభవిస్తున్న వైరాగ్య భావాన్ని పదాలు వ్యక్తం చేయాలని నేను కోరుకుంటున్నాను. అదే సమయంలో మీరు స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తారని నాకు తెలుసు. సవాళ్లను ఎదురొడ్డి తీసుకోవడం మీ స్వభావం. బలంగా తిరిగి రండి! మేమంతా మీ కోసం పాతుకుపోతున్నామని’’ మోడీ ట్వీటర్‌లో రాసుకోచ్చారు. అయితే మోడీ ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైంగిక వేధింపులపై పోరాటం చేసిన సమయంలో స్పందించని మోడీ.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. తమ ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపినందుకే వినేష్ ఫొగట్‌ను ఒలింపిక్స్ నుంచి తప్పించేందుకు కుట్ర చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ ఒలింపిక్స్‌ మెగా టోర్నీలో భాగంగా 16వ రౌండ్‌లో ప్రపంచ నంబ‌ర్ 1ను చిత్తుగా ఓడించింది. దీంతో వినేశ్ క్వార్ట‌ర్స్‌లోనూ జోరు చూపించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. 50 కిలోల విభాగం క్వార్ట‌ర్ ఫైన‌ల్లో వినేశ్‌ ఉడుం ప‌ట్టుతో ఉక్రెయిన్ రెజ్ల‌ర్ ఒక్సానా లివాచ్‌ను మ‌ట్టిక‌రిపించింది. ఆరంభం నుంచి ప్ర‌త్య‌ర్థిని ముప్ప‌ తిప్ప‌లు పెట్టిన భార‌త రెజ్ల‌ర్ 7-5తో గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. దాంతో, ఇండియాకు క‌నీసం కాంస్యం ఖ‌రారు చేసింది. ఇక మంగళవారం సాయత్రం జరిగిన సెమీ ఫైనల్ పోరులో వినేశ్ విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. కాగా డబ్ల్యూఎఫ్‌ఐకి వ్యతిరేకంగా మహిళా రెజ్లర్ నిరసనలలో ఆమె ప్రధాన వ్యక్తిగా వీధిలో నెలల తరబడి నిలిచిన విషయం తెలిసిందే. పోలీసు లాఠీతో ఈడ్చుకెళ్లిన ఇంకా న్యాయం కోసం పోరాడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయాని పట్టించుకోలేదు. 
 

newsline-whatsapp-channel
Tags : india-people pm-modi paris-olympic olympic2024-

Related Articles