ICC: ఐసీసీ ఛైర్మన్‌గా జై షా అఫీషియల్

అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా నియమితులయ్యారు


Published Aug 27, 2024 10:00:31 AM
postImages/2024-08-27/1724770649_jayicc.PNG

న్యూస్ లైన్ స్పోర్ట్స్:  అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా నియమితులయ్యారు. మంగళవారం ఈ విషయన్ని ఐసీసీ అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే తన పదవీకాలం నవంబర్ 30న ముగియనుండడంతో జే షా బాధ్యతలు స్వీకరించనున్నారు. అతి చిన్న వయసులో ఐసీసీ చీఫ్‌గా జైషా రికార్డు క్రియేట్ చేశారు. డిసెంబర్‌ 1న జైషా బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీసీఐ కార్యదర్శికి క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఇతర పూర్తికాల సభ్యుల నుంచి షాకు మద్దతు లభించింది. దీంతో షా ఐసీసీ చైర్మన్‌గా ఏకగ్రీవ ఎన్నిక అయ్యారు.


క్రికెట్ ఆస్ట్రేలియా చైర్ మైక్ బైర్డ్‌తో సహా ఐసీసీ డైరెక్టర్లకు బార్క్లే వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మూడోసారి ఈ పదవికి పోటీ చేసే ఉద్దేశ్యం లేదని చెప్పాడు. నవంబర్‌లో అతనిని భర్తీ చేయాలనే జే షా ఉద్దేశాలను తెలియజేసిన తర్వాత అతని నిర్ణయం వచ్చింది. కాగా, ఇండియా నుంచి ఇప్పటి వరకు జగ్‌మోహన్ దాల్మియా (1997 - 2000), శరద్ పవార్ (2010 - 2012) ఐసీసీ చీఫ్‌గా పని చేశారు. అయితే ఇప్పుడు భారత హోం మంత్రి అమిత్ షా కుమారుడు కూడా మూడో వ్యక్తిగా ఆ పదవినీ స్వీకరించబోతున్నాడు. దీంతో పలువురు క్రికెటర్లు జై షాకు అభినందనలు తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : india india-team cricket-news cricket

Related Articles