వరదల కారణంగా 18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన అన్నారు. విపత్తు నిర్వహణ విభాగం ఇటీవల తెలంగాణ సీఎస్ శాంతికుమారికి లేఖ రాసిందని ఆయన గుర్తుచేశారు.
న్యూస్ లైన్ డెస్క్: వరద బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని మాజీ మంత్రి, BRS నేత నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఆపద సమయంలో ప్రజలను ఆదుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన విమర్శించారు.
వరదల కారణంగా 18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన అన్నారు. విపత్తు నిర్వహణ విభాగం ఇటీవల తెలంగాణ సీఎస్ శాంతికుమారికి లేఖ రాసిందని ఆయన గుర్తుచేశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ ఖాతాలో రూ.1,345 కోట్లు ఉన్నట్లు తెలిపిందని అన్నారు. ఏటా ఏప్రిల్, అక్టోబరులో నిధుల వాడకం వివరాలు కేంద్రానికి పంపాలని వెల్లడించారు. అయితే, నిధుల విడుదలకు రాష్ట్రం నుంచి వినతి రాలేదని కేంద్రం తెలిపిందని నిరంజన్ రెడ్డి వెల్లడించారు.