MLA: సబితా ఇంద్రారెడ్డిని కలిసిన నిజాం కాలేజీ స్టూడెంట్స్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని గురువారం నిజాం కాలేజ్ విద్యార్థినిలు కలిశారు.


Published Aug 08, 2024 03:27:10 PM
postImages/2024-08-08/1723111030_nizam.PNG

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని గురువారం నిజాం కాలేజ్ విద్యార్థినిలు కలిశారు. గత ప్రభుత్వం నిజాం కాలేజ్ విద్యార్థినిల కోసం యూజీ అమ్మాయిలకు, పీజీ అమ్మాయిలకి వేరువేరుగా హాస్టల్ భవనాలు కట్టించినప్పటికీ ప్రస్తుతమున్న యూజీ భవనంలో పీజీ అమ్మాయిలకు 50%, యూజీ అమ్మాయిలకు 50% కేటాయించడాన్ని విద్యార్థినిలు నిరసిస్తూ గత 5 రోజులుగా ధర్నా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలను పట్టించుకోవడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలో మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి గతంలో మీరిచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 100% యూజీ విద్యార్థినులకు కేటాయించేలా చూడాలని కోరారు. అమ్మాయిలు చీకట్లో కూడా చేసిన ధర్నా పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, గతంలో ఉన్నటువంటి కేటాయింపుల మాదిరిగానే 100% యూజీ విద్యార్థినిలకు కేటాయించి వారికి న్యాయం చేయాల్సిందిగా నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ భీమా నాయక్‌కు సబితా ఇంద్రారెడ్డి కోరారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం దురదృష్టం అన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
 

newsline-whatsapp-channel
Tags : india-people mla brs sabithaindrareddy nizamcollegestudents

Related Articles