Oyo:ఓయో రూమ్ కి వెళ్తున్నారా..జాగ్రత్త లేదంటే కష్టమే.?

ప్రస్తుతం మార్కెట్ లో హోటల్ బుకింగ్ సంస్థల్లో అత్యంత ప్రాముఖ్యత పొందింది ఓయో. అలాంటి ఈ సంస్థ ప్రతి ఏటా తన బుకింగ్స్ ను పెంచుకుంటుంది తప్ప తగ్గడం లేదు. అయితే దేశంలోనే


Published Aug 29, 2024 08:02:00 AM
postImages/2024-08-29/1724897391_oyo.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం మార్కెట్ లో హోటల్ బుకింగ్ సంస్థల్లో అత్యంత ప్రాముఖ్యత పొందింది ఓయో. అలాంటి ఈ సంస్థ ప్రతి ఏటా తన బుకింగ్స్ ను పెంచుకుంటుంది తప్ప తగ్గడం లేదు. అయితే దేశంలోనే  హైదరాబాద్ ముందు స్థానంలో ఉందట. దీని తర్వాత  బెంగళూరు రెండవ స్థానంలో ఉంది. హైదరాబాదులోని కొన్ని గల్లీలో ఉండే భవనాలకు కూడా ఓయో బోర్డులు పెడుతున్నారు. అయితే ఓయో రూంలో అందరికీ అందుబాటులో ఉంటే మంచిదే కానీ, దాన్ని అసాంఘీక కార్యకలాపాలకు  కొంతమంది వాడుతున్నారని అపోహలు కూడా ఉన్నాయి.

 ఏది ఏమైనా ఓయో రూంకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. కొంతమంది నిర్వాహకులు నిచమైన పనులకు పాల్పడి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది.  అయితే తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ లో ఓయో నడిపించే వ్యక్తి నీచమైన పనికి ఒడిగట్టాడు. ఓయో రూంలో సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు.  అదే రూమ్ లోకి అద్దెకు వచ్చినటువంటి వ్యక్తుల అశ్లీల  చిత్రాలు రికార్డ్ అయిన తర్వాత  వాటి ద్వారా ఆ వ్యక్తులను బెదిరింపులకు గురి చేశాడు. డబ్బులు కూడా తీసుకున్నాడు.

అంతటితో ఆగకుండా ఆ వ్యక్తి ఇంకా బెదిరింపులకు గురి చేయడంతో సదరు జంట పోలీసులను ఆశ్రయించింది.  వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ హోటల్లోని సీసీ కెమెరాలను  గుర్తించి  సదరు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద రెండు ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇవే కాకుండా చాలా ఓయో రూమ్స్ లో ఈ విధమైన పరిస్థితులే ఎదురవుతున్నాయి. కాబట్టి ఓయో రూంకు వెళ్లేవారు తప్పక జాగ్రత్తగా ఉండాలని పోలీసుల హెచ్చరిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu police rangareddy cc-camera oyo rooms

Related Articles