తాము ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వంలో ఉన్న వారికి సమాచారం వెళ్తోందని ఆయన తెలిపారు. తమకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తోందని ఆయన ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: BRS అధికారంలో ఉండగా.. కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేశారు. ఇప్పుడేమో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ ఛైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. తన ఫోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేయించారని ఆయన ఆరోపించారు. తనది మాత్రమే కాకుండా BRSకు చెందిన ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతోందని ఆయన వెల్లడించారు.
తాము ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వంలో ఉన్న వారికి సమాచారం వెళ్తోందని ఆయన తెలిపారు. తమకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తోందని ఆయన ప్రశ్నించారు. సీపీ టేలీ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం తమ పర్సనల్ విషయమని కౌశిక్ రెడ్డి అన్నారు. సీపీ ఫోన్ కూడా ట్యాప్ అవుతోందని ఆయన తెలిపారు. తమ ఫోన్లనుట్యాపింగ్ చేయరని గ్యారంటీ ఏమిటి..? అని ఆయన ప్రశ్నించారు. పోలీస్ యంత్రాంగం ఒక సెక్యూరిటీ వింగ్ అని ఆయన అన్నారు. ప్రజల సేఫ్టివింగ్, అలాంటి పోలీస్‌ల ఫోన్లను ట్యాప్ చేయడం సిగ్గు చేటు అని కౌశిక్ రెడ్డి అన్నారు.