ప్రస్తుతం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఓ రేంజ్ లో ఉంది. వీరు హీరోలుగా, స్టార్స్ అవ్వడమే కాకుండా రాజకీయంగా కూడా అద్భుతంగా ఎదిగారని చెప్పవచ్చు. రాజకీయాల్లో చిరంజీవి ఓ స్థాయికి
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఓ రేంజ్ లో ఉంది. వీరు హీరోలుగా, స్టార్స్ అవ్వడమే కాకుండా రాజకీయంగా కూడా అద్భుతంగా ఎదిగారని చెప్పవచ్చు. రాజకీయాల్లో చిరంజీవి ఓ స్థాయికి వెళ్తాడు అనుకుంటే మధ్యలోనే డ్రాప్ అయిపోయి మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అనుకున్నది సాధించాడు. ఇంకా సాధించబోయేది ఉందని చెబుతున్నాడు. ఇప్పటికే జనసేన పార్టీని 21 స్థానాల్లో గెలిపించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదే తరుణంలో ఆయన పిఠాపురం నియోజకవర్గాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తారని అనేక వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు తాజాగా మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో రామ్ చరణ్ 10 ఎకరాల ల్యాండ్ కొన్నారని అన్నారు.
ప్రస్తుతం ఆ స్థలాన్ని ఉపాసనకు అప్పజెప్పారని , ఆమె ఆ 10 ఎకరాల స్థలంలో అత్యద్భుతమైన హంగులతో అపోలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని శంకుస్థాపన చేయబోతున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే మాత్రం పిఠాపురం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పవచ్చు. అంతేకాదు ఈ మధ్యకాలంలోనే హీరో వరుణ్ తేజ్ కూడా ఏపీలో రాజకీయంగానే కాకుండా, మాకు ఒక సొంత ఊరు ఏర్పడిందని అదే పిఠాపురం అని చెప్పుకొచ్చారు. ఈ విధంగా వీరంతా రాజకీయంగానే కాకుండా సొంతంగా కూడా పిఠాపురంలో పెట్టుబడులు పెట్టి అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించాలని ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.