తన సొంత మేనమామ పవన్ కోసం కాకుండా ప్రత్యర్థి కోసం ప్రచారం చేయడం చర్చనీయాంశంగామారింది. మాతో నిలబడి , మాకు తోడుగాఉండే వాడు కూడా మావాడితోనే సమానం అని ఆయన ట్వీట్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీలో విబేధాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గంలోనే ప్రత్యర్థి అయిన వైసీపీ అభిర్ది కోసం అల్లు అర్జున్ ప్రచారం చేశారు. దీనిపై అప్పట్లో నాగబాబు చేసిన ట్వీట్ కూడా చర్చనీయాంశమైంది. తన సొంత మేనమామ పవన్ కోసం కాకుండా ప్రత్యర్థి కోసం ప్రచారం చేయడం చర్చనీయాంశంగామారింది. మాతో నిలబడి , మాకు తోడుగాఉండే వాడు కూడా మావాడితోనే సమానం అని ఆయన ట్వీట్ చేశారు.
అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మెగా ఫ్యామిలీలో చీలికలు ఏర్పడ్డాయని జోరుగా ప్రచారం జరిగింది. ఆ తరువాత కొన్ని రోజులకు నాగబాబు ఆ ట్వీట్ డిలీట్ చేయడంతో.. పరిస్థితి కాస్త సద్దుమణిగినట్లు కనిపించింది. కానీ, తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.
బెంగళూరు పర్యటనలో గురువారం సినిమా హీరోల గురించి కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్‌ని టార్గెట్ చేస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 సంవత్సరల క్రితం హీరో అడవులను కాపాడే వాడని.. ప్రస్తుతం గొడ్డలను పట్టుకొని స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయిపోయిందని ఆయన అన్నారు. దీంతో అల్లు అర్జున్ పుష్ప సినిమాను ఉద్దేశించే పవన్ ఆ కామెంట్స్ చేశారని పలువురు అనుకుంటున్నారు.
Heroes around 40 years back are used to safeguard forests from smuggling, but now the heroes are someone who smuggles and axes away the trees.
- Deputy CM @PawanKalyan in Karnataka. pic.twitter.com/j5dXTCOwBl — Telugu Chitraalu (@TeluguChitraalu) August 8, 2024