Pm modi: కేంద్ర కేబినేట్ సమావేశం

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది.


Published Sep 02, 2024 04:12:16 PM
postImages/2024-09-02/1725273736_moditata.PNG

న్యూస్ లైన్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కేంద్ర కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల కోసం కేబినేట్ రూ.13,966 కోట్లు కేటాయించింది. అలాగే రైతుల కోసం డిజిటల్ అగ్రికల్చర్‌ మిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక డిజిటల్ అగ్రికల్చర్‌ మిషన్‌కు రూ.2817 కోట్లు, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీకి రూ.3979 కోట్లు, పశువుల ఆరోగ్యం, డైరీ ఉత్పత్తులకు రూ.1702 కోట్లు, హార్టీకల్చర్‌ అభివృద్ధికి రూ.860 కోట్లు, కృషి విజ్ఞాన్ కేంద్రం అభివృద్ధికి రూ.1,202 కోట్లు, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ కోసం రూ.1,115 కోట్లు నిధులను కేంద్ర కేటాయించింది. ఇక ఈ భేటీలో మన్మాడ్-ఇండోర్ రహదారికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని కోసం 309 కిలోమీటర్ల రహదారికి రూ.18,036 కోట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణాయించింది. 

newsline-whatsapp-channel
Tags : telangana centralgovernment minister farmers delhi meet pm-modi

Related Articles