Fake Gold: నకిలీ బంగారాన్ని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

శిల్పారామం వద్ద తక్కువ ధరకే ఒరిజినల్ బంగారం అని చెప్పి నకిలీ బంగారాన్ని విక్రయిస్తున్న ఇద్దరని పోలీసులు అరెస్టు చేశారు.


Published Sep 02, 2024 09:23:32 PM
postImages/2024-09-02/1725292412_fakegold.PNG

న్యూస్ లైన్ డెస్క్: శిల్పారామం వద్ద తక్కువ ధరకే ఒరిజినల్ బంగారం అని చెప్పి నకిలీ బంగారాన్ని విక్రయిస్తున్న ఇద్దరని పోలీసులు అరెస్టు చేశారు. సరూర్ నగర్ లో మొబైల్ టిఫిన్ సెంటర్ నిర్వహించే నరేందర్ వద్ద వంట మాస్టర్ గా చేసిన ఓంకార్ అతని స్నేహితుడుతో కలిసి తక్కువ ధరకు బంగారం ఇస్తారు అంటూ నరేందర్‌ను నమ్మించి రూ 8.95 లక్షల నగదు తీసుకొని నకిలీ బంగారాన్ని ఇచ్చాడు. అయితే అనుమానంతో  వెరిఫై చేయగా నకిలీ బంగారం అని తేలింది.

దీంతో నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు బొడ్డు ఓంకార్, వాసులను అదుపులోకి తీసుకొని వారి నుంచి నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసున్నారు. ఇక ఈ ఇద్దరని రీమండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana hyderabad congress police cm-revanth-reddy gold arrest

Related Articles