పిల్లలు జాగ్రత్త.. మనకు ఎవరూ లేరు. కానీ మన పిల్లలు ఆగం కాకూడదు. నేను ఎన్నో ఊహలు కన్నాను కానీ ఏదీ కుదరలేదు. వచ్చే జన్మ ఉంటే మాత్రం నా పిల్లల్లో ఎవరి కడుపులో నైనా పుడతా.. ఇంకొకటి రజిని నీకు వీలైతే
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తుందని భాజా భజంత్రీలు పెట్టి ప్రచారం చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ప్రజల్లోకి వెళ్లి చూస్తే మాత్రం ఈ పాలన పశుపతి పాలనలా ఉందని అంటున్నారు. 6 గ్యారెంటీల పేరుతో అందరినీ ఆగం చేస్తున్నారు. ప్రజాపాలనలో ఉద్యోగులు, నిరుద్యోగులు పేద ప్రజలు బాగుపడతారని అంతా భావించి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే స్కాంగ్రెస్ పాలన చేస్తూ ప్రజల్ని ఉద్యోగులను పీడిస్తున్నారు. రోజు ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగులు జీతాలు లేక కుటుంబాల్ని పోషించలేక ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నా పరిస్థితులు చూస్తూనే ఉన్నాం.
కనీసం వీటి గురించి ప్రశ్నించే మీడియా లేదు. అయితే తాజాగా మరో ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి వసీం ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ప్రధాన కారణం ఆయనకు మూడు నెలలుగా జీతాలు లేకపోవడమే అని తెలుస్తోంది. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పడుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న తరుణంలో, ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అయితే వసీం అనే ఉద్యోగి ఒక చిన్న లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకీ ఆయన ఏం రాసాడంటే.. డియర్ రజిని ఫస్ట్ నన్ను క్షమించు.. నిన్ను చాలా బాధ పెట్టాను..
https://x.com/KTRBRS/status/1825007627442487701?s=19
పిల్లలు జాగ్రత్త.. మనకు ఎవరూ లేరు. కానీ మన పిల్లలు ఆగం కాకూడదు. నేను ఎన్నో ఊహలు కన్నాను కానీ ఏదీ కుదరలేదు. వచ్చే జన్మ ఉంటే మాత్రం నా పిల్లల్లో ఎవరి కడుపులో నైనా పుడతా.. ఇంకొకటి రజిని నీకు వీలైతే వీళ్లకు డబ్బులు ఇవ్వు ఎందుకంటే నేను చనిపోయాక వాళ్ళు నన్ను తిట్టుకుంటారు. ఎక్కువ ఏం చేయలేదు.. చౌదరయ్య 950, రమణ 500, క్రాంతి 40, నవీన్ 100, ఎలక్ట్రీషియన్ కు 200.. వీళ్లకు డబ్బులు ఇవ్వు అంటూ ఒక లెటర్ రాసి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనిపై కేటీఆర్ కూడా స్పందించి ప్రభుత్వం పూర్తిగా అబద్ధాలాడుతూ ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తుందని ప్రగల్బాలు పలుకుతుందని విమర్శించారు. ప్రభుత్వం చేసే ఈ తప్పుల వల్ల ప్రాణాలు పోతున్నాయని అతని ప్రాణానికి బాధ్యులు ఎవరంటూ ట్వీట్ చేశారు.