Puja Khedkar: అరెస్ట్ భయంతో దుబాయ్‌కు చెక్కేసిన ట్రైనీ ఐఏఎస్ పూజాఖేద్కర్ ?


మరోవైపు, పూజ వివాదం తో పాటు  మరో ఆరుగురు ఐఏఎస్ అధికారుల వైకల్య పత్రాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Published Aug 03, 2024 08:19:00 AM
postImages/2024-08-03/1722653655_poojakhedkartraineeias.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజాఖేద్కర్ అరెస్ట్ భయంతో దుబాయ్‌కు జంప్ అంటున్నారు నేషనల్ మీడియావాళ్లు. చేసిన హంగామా అంతా చేసేసి ఇప్పుడు అరెస్ట్ భయంతో పారిపోయింది పూజా ఖేద్కర్ . యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చిన కేసులో పూజ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆమె తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో అరెస్ట్ తప్పదని అనుకున్న పూజ దుబాయ్ కి వెళ్లిపోయారని టాక్.


మరోవైపు, పూజ వివాదం తో పాటు  మరో ఆరుగురు ఐఏఎస్ అధికారుల వైకల్య పత్రాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర సిబ్బంది, శిక్షణశాఖ (డీపీటీవో) వారి పత్రాలను పరిశీలిస్తున్నారు. రీసెంట్ గా పూజ ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. తమ ఎదుట హాజరు కావాలన్న ఆదేశాలను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, భవిష్యత్తులోనూ ఆమె యూపీఎస్సీ పరీక్షలు, నియామకాల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది.


ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా ఫుల్ వైరల్ అవుతుంది. ఊరికే ఉంటే అయిపోతుంది కదా అక్కా..ఎందుకు ఇంత చేసుకున్నావంటు జాలి చూపిస్తున్నారు నెటిజన్లు ట్రైనింగ్ అయిపోతే ఐఏఎస్ అయిపోతావుగా ఎందుకు తొందర ...ముందే కారు కావాలి..బంగ్లా కావాలంటూ ఆర్డర్లు పాస్ చేసి ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ ఇలా అయ్యిందంటూ సోషల్ మీడియా ఫుల్ కామెంట్ల వర్షం కురిపిస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu dubai trainee-ias-

Related Articles