Pushpa:పుష్ప@3,4,5.. తగ్గేదేలే.!

పుష్ప ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు వినిపిస్తోంది. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చినటువంటి పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన హిట్


Published Aug 23, 2024 10:02:00 AM
postImages/2024-08-23/1724384261_sukumar.jpg

న్యూస్ లైన్ డెస్క్: పుష్ప ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు వినిపిస్తోంది. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చినటువంటి పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన హిట్ సాధించింది. అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప2 సినిమా రాబోతోంది. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నటువంటి ఈ మూవీ  థియేటర్లలోకి రావడానికి కాస్త టైం పడుతుంది.  అలాంటి పుష్ప మూవీ గురించి తాజాగా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  పుష్ప2 సినిమాతో ఆగిపోతుందా ఇంకా ఉంటుందనే ప్రశ్నకు సుకుమార్ సమాధానం ఇచ్చారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.

పుష్ప2 సినిమా డిసెంబర్ నెలలో రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. పుష్ప మొదటి పార్ట్ సినిమా తీసిన సమయంలో  రెండవ పార్ట్ తీయాలని ఆలోచన లేదట. ఈ సినిమా భారీ హిట్ అవ్వడంతో రెండో పార్ట్ మీద అంచనాలు పెరిగాయి. దీంతో రెండవ పార్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సెకండ్ పార్ట్ కూడా హిట్ అయితే కథ ముగియదని పార్ట్ 3 కి లీడ్ కూడా ఉంటుందని  ఓ చర్చ సాగుతోంది. వీలును బట్టి  బన్నీ సుకుమార్  కాంబోలో మూడవ పార్ట్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. అయితే తాజాగా సుకుమార్ భార్య తబితా సమర్పణలో  మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన సుకుమార్ , పుష్ప చిత్రానికి ఇంకా నాలుగు పార్ట్ లు ఉంటాయని కథ ఎప్పటికీ ఆగదని చెప్పారు.  ఈ ప్రోగ్రాంలో సుమ ఆర్య 2 వచ్చాక మీరు ఆపేసినట్టు పుష్ప2 సినిమా తీశాక ఆపేస్తారా అని ప్రశ్నించింది.  దీంతో సుకుమార్ పుష్ప3, 4, 5 సినిమాలు కూడా ఉంటాయని నవ్వుతూ అన్నారు.  ఆయన అలా అనడంతో  పుష్ప2, చిత్రంపై మరింత ఆసక్తి పెరుగుతోంది. అయితే సుకుమార్ సినిమా నాణ్యత విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడడు. కాస్త లేట్ అయిన మంచిదే సినిమాను మంచి దర్పణం వచ్చేలా తెరకెక్కిస్తారు. అందుకే పుష్ప2 చిత్రం  చాలా లేటుగా షూటింగ్ జరుపుకుంటుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pushpa sukumar pushpa2 pushpa-3,4,-5 thabitha maruthi-nagar-subramanyam

Related Articles