అబ్బాయిలు పైజామాతో నౌకలో ముందుకు సాగారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించగా.. మిగిలిన అథ్లెట్లు వెనక నిల్చున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పీవీ సింధు ఒలంపిక్ చీరపై దుమారం తారా స్థాయిలో జరుగుతుంది. పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)లో భారత ఆటగాళ్లు లక్ పరీక్షించుకుంటున్నారు. పారిస్ వేదికగా భారత అథ్లెట్లు తళుకున్న మెరిశారు. చీర కట్టులో భారత మహిళ అథ్లెట్లు చాలా హుందాగా కనిపించారు. అబ్బాయిలు పైజామాతో నౌకలో ముందుకు సాగారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించగా.. మిగిలిన అథ్లెట్లు వెనక నిల్చున్నారు.
అయితే ఈ పరేడ్‌లో భారత ఆటగాళ్లు ధరించిన దుస్తులపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముంబై మార్కెట్‌లో 200 రూపాయలకు భారత ఆటగాళ్లు ధరించిన దుస్తులు కంటే మంచి వస్త్రాలు వస్తాయని ప్రముఖ రచయిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. భారతీయ అథ్లెట్లను అంత మాట అనడం పై తీవ్ర దుమారం రేగుతుంది. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీ( Tarun Tahilian) డిజైన్ చేసిన ఈ దుస్తులు చాలా చీప్ గా ఉన్నాయంటూ ..బెంగళూరుకు చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ నందితా అయ్యర్ అనడంపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చౌకైన పాలిస్టర్, ఇకత్ ప్రింట్‌తో భారత అథ్లెట్లు ధరించిన దుస్తులు చాలా దారుణంగా ఉన్నాయని అన్నారు. రెండు మూడు నిమిషాల్లో డిజైన్ చేసేశారా అని అంటున్నారు. అంతేకాదు నెటిజన్లు అయితే చేనేతలో చేసి ఉంటారని ఆ బట్టలు అందంగా కనిపించకపోయినా...చాలా మంచి కన్ఫర్ట్ గా ఉంటాయని అంటున్నారు. అంతేకాదు ..నేత దుస్తుల్లో కూడా మన అథ్లెట్లు చాలా హుందాగా ఉన్నారని అంటున్నారు.
అయితే ఈ బట్టలు కోసం ఒక్క "హలో తరుణ్ తహిలియానీ! మాత్రమే కాదు విజయలక్ష్మి ఛబ్రా ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ఇదే డిజైనర్ తరుణ్ తహిలియానీ ..అంబానీ ఫ్యామిలీ కి ఒకలా ...అథ్లెట్స్ కు ఒకలా తయారుచేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఈ టాపిక్ ఇప్పుడు నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు.