ఈగ తో సినిమా అనౌన్స్ చేశాక జనాలు చాలా ఇంట్రస్ట్ చూపించారు. ఈగతో సినిమా ఎవరు చూస్తారు అనుకున్నారట రాజమౌళి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రాజమౌళి కి జక్కన్న పేరే కరెక్ట్ ..తను తీసుకున్న కథను ఎంత చక్కగా చెక్కాలో అంత చక్కగా చెక్కుతాడు. అయితే ఇలా చెక్కిన ప్రతి కథ సూపర్ డూపర్ హిట్టు. అసలు రాజమౌళి చాలా ఫార్మల్ గా ఏదో ట్రై చేద్దామనుకున్నాడు..సూపర్ డూపర్ హిట్టయ్యింది. అదే ఈగ సినిమా ..ఏదో అలా పై పైన తీసేసి ...ఓ ప్రయోగం చేద్దామనుకున్నాడు.
ఈగ తో సినిమా అనౌన్స్ చేశాక జనాలు చాలా ఇంట్రస్ట్ చూపించారు. ఈగతో సినిమా ఎవరు చూస్తారు అనుకున్నారట రాజమౌళి. కట్ చేస్తే తక్కువ బడ్జెట్ అనుకున్నాడట..అలా పెరిగి భారీ బడ్జెట్ సినిమా అయ్యింది.రాజమౌళి మగధీర లాంటి భారీ చిత్రం తర్వాత మర్యాదరామన్న చేశారు. ఇవి హిట్టు టాక్ రావడం అది ఈగ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది.
ఈగ సినిమాను సీక్రెట్ గా తీసేద్దాం అనుకున్నాడట. కనీసం మీడియాకి, జనాలకు ఎవరికీ తెలియకుండా తక్కువ టైంలో షూటింగ్ పూర్తి చేసి సర్ప్రైజింగ్ గా సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నారట. కానీ మీడియాలో ఈగ చిత్రం గురించి మ్యాటర్ లీక్ అయిపోయింది. ఇక సినిమా అనౌన్స్ చెయ్యక తప్పలేదు. ఫస్ట్ రాజమౌళి ఒక యానిమేషన్ చిత్రం చేస్తున్నారని.. ఇందులో హీరోయిన్లు హీరోలు ఉండరు అంటూ ప్రచారం మొదలయింది. సీక్రెట్ కాస్త రివీల్ అయిపోవడంతో చేసేది లేక చెప్పాల్సి వచ్చింది.సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోయి ఈగ భారీ చిత్రంగానే ఆడియన్స్ ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది.