పాన్ ఇండియా సినిమా లు బాహుబలి, పుష్ప , కల్కి , ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలు షూటింగ్స్ ఇక్కడ జరిగాయి. వేవ్స్ సదస్సులో ఫిల్మ్‌సిటీ స్టాలును ఏర్పాటు చేశారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ముంబయి లో జరుగుుతన్న వేవ్స్ సదస్సులో రామోజీ ఫిలిం సిటీ స్టాల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలచింది. రామోజీ ఫిలిం సిటీ ఇప్పటిదాకా 3,500కు పైగా చిత్ర నిర్మాణాలు ఇక్కడ జరిగాయి. పాన్ ఇండియా సినిమా లు బాహుబలి, పుష్ప , కల్కి , ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలు షూటింగ్స్ ఇక్కడ జరిగాయి. వేవ్స్ సదస్సులో ఫిల్మ్‌సిటీ స్టాలును ఏర్పాటు చేశారు .
అంతకుముందు ముంబయి బాంద్రాలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో తొలి గ్లోబల్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్మెంట్ సమ్మిట్- వేవ్స్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రతిభ, సృజనాత్మకతల కోసం ప్రపంచ వేదిక నిర్మాణానికి వేవ్స్ పునాది వేస్తుందని తెలిపారు. అయితే హైదరాబాద్ ఎంటర్ టైన్ మెంట్ హబ్ గా మారుతుందని అంటున్నారు . చిత్రనిర్మాణం డిజిటల్ కంటెంట్ , గేమింగ్ , ఫ్యాషన్ , మ్యూజిక్ , కాన్సర్ట్ లకు భారత్ కేంద్రంగా అభివృ్ధ్ధి చెందుతున్న వేళ ప్రపంచ ప్రతిభ కు ఒక వేదికను అందించే సామర్థ్యం వేవ్స్‌కు ఉంటుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.