Rat: బాలికల పాఠశాలలో ఎలుకల స్వైర విహారం

రామాయంపేటలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఎలుకల స్వైర విహారం చేసింది.


Published Jul 11, 2024 11:06:47 AM
postImages/2024-07-11/1720695119_ratbite.PNG

న్యూస్ లైన్ డెస్క్: మెదక్ జిల్లా రామాయంపేటలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఎలుకల స్వైర విహారం చేస్తున్నాయి. 9వ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థినిలను ఎలుకలు కరిచాయి. ఇద్దరు విద్యార్థినిలు అర్ధరాత్రి దాటాక ఉలిక్కిపడి లేచి చూడగానే కాళ్లు, పాదాలకు గాయాలై నెత్తురు కారుతుండటాన్ని చూసుకొని భయాందోళనలకు గురయ్యారు. దాంతో గురుకుల సిబ్బంది వెంటనే విద్యార్థినిలను ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళన చేపట్టారు. తమ పిల్లల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం అడుగుతుందని మండిపడ్డారు. ఎలుకలతో తాము ఇబ్బందిపడుతున్నామంటూ ఎన్నోసార్లు హాస్టల్స్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన చేశారు. ప్రభుత్వం పిల్లలకు మెరుగైన వైద్యం అందించి ఆస్పత్రి ఖర్చులు భరించాలని కోరారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వెంటనే స్పందించి యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana students congress ratinfood

Related Articles