గతంతో పోలిస్తే.. 15.30 లక్షల ఎకరాల మేర సాగు తగ్గినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. పత్తి సాగు 2.67 లక్షల ఎకరాల్లో తగ్గినట్లు తెలిపారు. గత ఏడాది ఈ సమయం వరకు 99.89 లక్షల ఎకరాల్లో సాగు జరగగా.. ఈ ఏడాది 84.59 లక్షల ఎకరాలకు పడిపోయినట్లు తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: కొంతకాలం అయితే రాష్ట్రంలో పంట సాగు పూర్తిగా మూలనపడనుందా అనే పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో రైతులకు BRS ప్రభుత్వం పెట్టుబడి సహాయం చేసింది. రైతుబంధు కింద ఎకరానికి రూ. 5 వేల సహాయం అందించేవారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా.. ఇప్పటికీ ఒక్క విడత కూడా రైతుబంధు పడలేదు. దీంతో రైతులకు ఆర్ధిక సహాయం అందకుండా పోయింది. మరోవైపు రుణమాఫీ విషయంలో కూడా తీవ్రమైన గందరగోళం ఏర్పడింది. దీంతో తెలంగాణలో పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సారి వరి సాగు కూడా తక్కువగానే ఉన్నట్లు సమాచారం.
గతంతో పోలిస్తే.. 15.30 లక్షల ఎకరాల మేర సాగు తగ్గినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. పత్తి సాగు 2.67 లక్షల ఎకరాల్లో తగ్గినట్లు తెలిపారు. గత ఏడాది ఈ సమయం వరకు 99.89 లక్షల ఎకరాల్లో సాగు జరగగా.. ఈ ఏడాది 84.59 లక్షల ఎకరాలకు పడిపోయినట్లు తెలిపారు. వరి బోనస్‌పై మాట మార్చడంతో 66 లక్షల్లో వరి పంట సాగు చేస్తారని అంచనా వేయగా.. కేవలం 25.58 లక్షల ఎకరాల్లోనే వరి సాగు జరిగింది.
పంట వేసే ముందు పెట్టుబడి సాయం రైతుబంధు ఇవ్వలేకపోవడం, గత నెల వర్షాలు లేకపోవడం, చెరువులు ఎండిపోయి ఉండడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఇక చెరువులు అలుగు పోసే సమయంలో ఇంకా రాష్ట్రంలోని 15,131 చెరువుల్లో 25 శాతం కంటే తక్కువే నీళ్లు ఉన్నాయని అన్నారు.