Delhi: జేపీ.నడ్డాను కలిసిన రేవంత్ రెడ్డి

ఈ నిధుల విడుదలలో ఆలస్యం కావ‌డంతో అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల‌కు అంత‌రాయం కలుగుతోందని నడ్డాకు రేవంత్ తెలిపారు. సిబ్బందికి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం వాటా మొత్తాన్ని కూడా అక్టోబర్ 2023 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే విడుద‌ల చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.

Published Jun 25, 2024 05:22:30 PM
postImages/2024-06-25/1719316350_Untitleddesign13.jpg

న్యూస్ లైన్ డెస్క్: మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ.నడ్డా(JP.Nadda)ను కలిశారు. ప్రస్తుతం ఢిల్లీ(Delhi) పర్యటనలో ఉన్న రేవంత్.. నడ్డాను కలిసి వినతి పత్రం అందించారు. జాతీయ ఆరోగ్య మిష‌న్(NHM) కింద తెలంగాణ‌కు రావ‌ల్సిన బ‌కాయిలు రూ.693.13 కోట్లు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని లేఖ ద్వారా కోరారు. NHM కింద చేప‌ట్టిన మౌలిక వ‌స‌తులు, నిర్వ‌హ‌ణ కాంపోనెంట్ కింద 2023-2024 సంవ‌త్స‌రానికి సంబంధించి రావ‌ల్సిన రూ.231.40 కోట్ల నిధులను కూడా త‌క్ష‌ణ‌మే రీయింబ‌ర్స్ చేయాల‌ని సీఎం కోరారు.

అనంతరం వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్ర‌భుత్వం(Telangana government) పెడుతున్న ప్ర‌త్యేక చర్యలను వివ‌రించారు. ఆరోగ్య మిషన్ 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు పెండింగ్‌లో ఉండటమే కాకుండా 2024-25 మొద‌టి త్రైమాసిక గ్రాంట్ రూ.138 కోట్లు కూడా మంజూరు చేయాల్సి ఉంద‌ని తెలిపారు. ఆ మొత్తాన్ని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరారు. ఆయుష్మాన్ భార‌త్(Ayushman Bharat) నిబంధ‌న‌లు ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి అమ‌లు చేసినట్లు కేంద్ర మంత్రికి వివరించారు. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు 5,159 బ‌స్తీ ద‌వాఖానాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 

ఈ నిధుల విడుదలలో ఆలస్యం కావ‌డంతో అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల‌కు అంత‌రాయం కలుగుతోందని నడ్డాకు రేవంత్ తెలిపారు. సిబ్బందికి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం వాటా మొత్తాన్ని కూడా అక్టోబర్ 2023 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే విడుద‌ల చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.

newsline-whatsapp-channel
Tags : india-people ts-news newslinetelugu telanganam jp.nadda nhm telangana-government ayushman-bharat

Related Articles