న్యూస్ లైన్ డెస్క్ : హైడ్రాపై కొత్త ప్లాన్ చేశారట సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల నుంచి, పార్టీ నేతల నుంచి ఒత్తిడి రావడం, తాను చేసేది కరెక్ట్ కాదని చెప్పడంతో సరికొత్త ఆలోచన చేశారట. తాను చేసింది రైట్ అని చెప్పించుకోవడానికి కొన్ని టీంలను సిద్ధం చేసుకున్నారట. ఓ వైపు తన చేతుల్లోనే ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఊదరగొడుతూనే ఉంది. హైడ్రా ఆహా.. ఓహో అంటూ వార్తలు వండివారుస్తున్నాయి. తమ మీడియాలో చేయించుకుంటున్న ప్రచారం సరిపోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి భావించారట. అందుకే ఇందులోకి సినిమావాళ్లను కూడా దించారనే మాట వినిపిస్తోంది. మీడియా కంటే కూడా సినిమావాళ్లు చెప్పేంది బలంగా ప్రజల్లోకి వెళ్తుందనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది.
గత రెండు మూడు రోజులుగా కొందరు సినీ నటులు హైడ్రా అద్భుతం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి హైడ్రాతో ఓ గొప్ప మహాకార్యం చేస్తున్నారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నాగబాబు, డైరెక్టర్ హరీష్ శంకర్, నటి మధుశాలిని ట్వీట్ చేశారు. వీరంతా ఒకరి తర్వాత ఒకరు ట్వీట్లు చేయడం, ట్వీట్లు కూడా దాదాపుగా ఒకేలా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వీరి ట్వీట్లపై జనం నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. పేదల ఇండ్లు కూల్చుతుంటే అద్భుతం అంటూ పోస్టులు పెడతారా అంటు నెటిజన్లు మండిపడుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూలగొట్టి వేలాది మందిని నడి రోడ్డు మీద పడిస్తే మీకు గొప్పగా ఉందా.? అంటూ ప్రశ్నిస్తున్నారు. సినీ నటులుగా పేదలను ఆదుకోవాలన్న కనీస జ్ఞానం మరిచి పీఆర్ స్టంట్స్ చేయడానికి మీకు మనసెలా వచ్చిందంటూ చీవాట్లు పెడుతున్నారు.
రాష్ట్రంలో శిష్యుడికి కష్టాలు వస్తున్నాయని గ్రహించిన ఏపీ సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డిని కాపాడుకునే పనిలో పడ్డారట. దీనిలో భాగంగా సపోర్టు చేయాలని నాగబాబుకు సూచించారట. చంద్రబాబు చెప్పడం వల్లే నాగబాబు ట్వీట్ చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాదు పలువురు సెలబ్రిటీలో కూడా ఇలా పోస్టులు పెట్టించారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న మాట. సెలబ్రిటీ పీఆర్ స్టంట్ వెనుక మరో రహస్యం ఉందన్న చర్చ నడుస్తోంది. ఓ వైపు అధిష్టానం దగ్గర కాంగ్రెస్ నేతలు హైడ్రాపై ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. పేదల ఇండ్లను కూల్చుతున్నారని మరో ఫిర్యాదు కూడా ఢిల్లీకి చేరినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో హైకమాండ్ అసలు హైడ్రా వ్యవహారం ఏంటనే దానిపై హైకమాండ్ నజర్ పెట్టిందట. దీంతో ఎక్కడ తన తప్పులు బయటపడతాయోనని ఇలా తన మీడియాతో పాటు, సెలబ్రిటీలకు డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడిపిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.