Mr Bachchan Movie Review:దూసుకుపోతున్న 'మిస్టర్ బచ్చన్'..రవితేజ నీకు సాటెవరయ్య.!

 ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలకు చాలా ఆదరణ దక్కుతోంది.  ముఖ్యంగా చాలామంది తమిళ్, బాలీవుడ్ లో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాలు తెలుగులో కూడా భారీ హీట్


Published Aug 16, 2024 04:34:22 AM
postImages/2024-08-15/1723687598_mrbachahan.jpg

 నటీనటులు : రవితేజ భాగ్యశ్రీ జగపతిబాబు తనికెళ్ల భరణి సత్య.
 ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి 
ప్రొడ్యూసర్స్: టీజీ విశ్వప్రసాద్ 
 డైరెక్టర్: హరి శంకర్  

 ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలకు చాలా ఆదరణ దక్కుతోంది.  ముఖ్యంగా చాలామంది తమిళ్, బాలీవుడ్ లో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాలు తెలుగులో కూడా భారీ హీట్ అందుకుంటున్నాయి. అంతేకాకుండా తెలుగులో హిట్ అయిన సినిమాలను కూడా  ఇతర ఇండస్ట్రీలో రీమేక్ చేసి హిట్స్ అందుకుంటున్నారు.  తాజాగా హిందీ హీరో అజయ్ దేవగన్ నటించిన రైడ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు.  ఈ చిత్రాన్ని ఫేమస్ డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వం వహించగా మిస్టర్ బచ్చన్ పేరుతో సినిమాను ఆగస్టు 15న థియేటర్స్ లోకి విడుదల చేశారు. సినిమా ఎలా ఉందో రిజల్ట్ చూద్దాం.

 స్టోరీ :
 మిస్టర్ బచ్చన్  స్టోరీ విషయానికి వస్తే ఇందులో ఆయన   ఇన్ కమ్ టాక్స్ అధికారిగా  పనిచేస్తారు. ఇందులో ఆయన సిన్సియారిటీకి మారుపేరుగా ఉంటారు. ఇదంతా బాగానే ఉన్నా ఆయన ఎక్కువ సిన్సియారిటీ వల్ల  ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అలా ఇన్కమ్ టాక్స్ రైడ్స్ చేస్తున్న క్రమంలో పై ఆఫీసర్లు అతన్ని  ఏ కారణం లేకుండానే సస్పెండ్ చేసేస్తారు. చివరికి  రవితేజ తన సొంత ఊర్లోకి వచ్చి తన పేరెంట్స్ తో జీవిస్తూ తన జీవితాన్ని గడుపుతాడు.ఈ తరుణంలో బ్రతకడం కోసం ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలో నిర్వహిస్తూ పెళ్లిళ్లు ఫంక్షన్లలో పాటలు పాడుతూ ఉంటాడు. ఈ టైంలోనే ఆయనకు భాగ్యశ్రీ హీరోయిన్ తో పరిచయం ఏర్పడి, ప్రేమ పుడుతుంది.  ఇదే తరుణంలో మరో ఆఫీసర్ ఈయన గురించి తెలుసుకొని ఆయన ఏ తప్పు చేయలేదని గ్రహించి, మరోసారి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరగానే ఆయనకు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసే పని అప్పచెప్తారు. ఆయన డ్యూటీలోకి రాగానే ముత్యం జగ్గయ్య  ( జగపతిబాబు ) అనే బిజినెస్ మ్యాన్ కి సంబంధించిన ఇంట్లో ఇన్కమ్ టాక్స్ రైడ్ చేయాలని పని అప్పగిస్తాడు. దీన్ని రవితేజ ఎలా కంప్లీట్ చేస్తాడు. ఈ టైంలో జరిగిన గొడవలేంటి. ముత్యం జగ్గయ్య అంటే ఎందుకు భయపడతారు.  ఆయనను రవితేజ  కట్టడి చేసి విజయం ఎలా సాధిస్తాడు. హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది పూర్తి సినిమా చూడాల్సిందే.

 విశ్లేషణ:
 డైరెక్టర్ హరీష్ శంకర్ నుంచి సినిమా వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది.  చివరిగా 2019లో గద్దల కొండ గణేష్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.  ఇక అప్పట్నుంచి ఆయన మంచి కథ కోసం వెతికి చివరికి మిస్టర్ బచ్చన్ పేరుతో  రవితేజ హీరోగా ఈ సినిమా తీసుకువచ్చారు. ఈ సినిమా అంతా బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే విషయంలో కాస్త తేడా కొట్టింది అని చెప్పవచ్చు. కొన్ని క్యారెక్టర్ లను బాగా వాడుకోవచ్చు కానీ హరీష్ శంకర్  అంతగా వాడుకోలేదు. ఇక రవితేజ యాక్టింగ్ మరింత వాడుకొని ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చేది. ప్రభాస్ శీను, చమ్మక్ చంద్ర, కామెడీ మాత్రం చెప్పరక్కర్లేదు. మొత్తానికి ఈ చిత్రంలో డైరెక్టర్ నటులను వాడుకోవడంలో కాస్త తడబడ్డాడు అని చెప్పవచ్చు. ఇది ఎలాగూ రీమేక్ సినిమా కాబట్టి అనేక జాగ్రత్తలు తీసుకొని సినిమాను సరికొత్తగా చూపించి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. 

 ఇక సినిమా మొదటి భాగంలో వచ్చిన లవ్ స్టోరీ, మొత్తం చిత్రానికే పూర్తి మైనస్ గా మారింది. ఏ మాత్రం ఆకట్టుకోలేని సీన్లతో రాసుకున్న హరీష్ శంకర్ వాటిలో ప్రేక్షకులని  ఇలా మెస్మరైజ్ చేయగలడు అనే థాట్ వచ్చింది. తనికెళ్ళ భరణి క్యారెక్టర్ కి మాత్రం మంచి ఆదరణ ఉందని చెప్పవచ్చు. ఈయనను అద్భుతంగా వాడుకున్నాడు. రవితేజ ఎమోషనల్ సీన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. తప్పనిసరిగా రవితేజ ఎమోషన్ చూస్తే మాత్రం, అభిమానులు కన్నీరు పెడతారు. ఇక సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే  దేవిశ్రీ ప్రసాద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే మరింత బాగుండేది. మిక్కీ జే మేయర్ లాంటి  ఔట్ డేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకోవడం వల్ల కాస్త  అద్భుతంగా అనిపించలేదు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సిద్దు జొన్నలగడ్డ క్యాంమియో రోల్. ఇది అందరినీ ఆకట్టుకుంది. ఇది సినిమాకి హైలైట్ గా చెప్పవచ్చు.

 నటీనటుల పనితీరు :
 ఇందులో సీనియర్ నటుడు జగపతిబాబు హీరో రవితేజతో  పోరాడే విధానం అద్భుతంగా చూపించారు.  వీరి మధ్య నడిచిన వార్ వేరే లెవల్ అని చెప్పవచ్చు.  ఇక వీరి తర్వాత మిగతా నటినటులు వారి వారి పాత్రల్లో అద్భుతంగా చేశారని చెప్పవచ్చు..

 ప్లస్ పాయింట్స్:
 సత్య కామెడీ  
 సిద్దు జొన్నలగడ్డ పర్ఫామెన్స్ 
 రెండవ భాగం సీన్స్ 

 మైనస్ పాయింట్స్ :
 స్క్రీన్ ప్లే
 కథలో కాస్త చేంజెస్ ఉంటే బాగుండు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu raviteja siddu-jonnalagadda jagapathi-babu mr-bachchan-movie-review

Related Articles