పాపం ఏదో యుధ్ధంలో గాయపడిన వారికి సాయపడదామనుకొని సాయం చేస్తే శత్రు దేశానికి సాయం చేస్తావా అంటూ ఫుల్ ఫైర్ అయ్యారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పాపం ఏదో సాయం చెయ్యాలనుకుంది. కాని కోరి కష్టాలు తెచ్చుకుంది ఓ అమ్మాయి. సాయం చేసే వాడికే..ఇబ్బందులన్నీ..అమెరికా-రష్యన్ జాతీయురాలైన సేనియా ఖావానా (33) అనే మహిళ ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాలు అందించింది. రష్యా ..ఉక్రెయిన్ కు భయంకరమైన యుధ్దాలు జరుగుతున్నాయి అందరికి తెలిసిందేగా. పాపం ఏదో యుధ్ధంలో గాయపడిన వారికి సాయపడదామనుకొని సాయం చేస్తే శత్రు దేశానికి సాయం చేస్తావా అంటూ ఫుల్ ఫైర్ అయ్యారు.
రష్యాకోర్టు సదరు మహిళను కఠినంగా శిక్షించింది. దేశ ద్రోహం నేరం కింద ఆమెకు ఏకంగా 12 యేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమె ఇచ్చింది కూడా ..రష్యన్ కరెన్సీ లో 52 డాలర్లు ఇచ్చింది. దీనికే..12 యేళ్ల శిక్ష అన్యాయమంటున్నారు నెటిజన్లు.
సేనియా కూడా నగదు బదిలీ చేసినట్లు అంగీకరించింది. ఇలా సేకరించిన విరాళాలతో ఉక్రేనియన్ సాయుధ దళాల కోసం వైద్య సామాగ్రి, పరికరాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. సేనియా తనకు తెలియకుండానే దేశద్రోహం అభియోగాలు ఒప్పుకుంది. ఇక చేసేది లేక 12 యేళ్లు శిక్ష విధించింది. తన తరుపున లాయర్లు కూడా పోరాటం చేస్తామని తన క్లయింట్ అంత పెద్ద నేరం చెయ్యలేదని ..మానవత్వం ఉన్న మనిషిగా సాయం చేశారని తెలిపారు.