రాత్రి రాత్రి ఇళ్లను కూల్చేయడంతో రోడ్డున పడ్డామని వారు వాపోయారు. ఆ ఇళ్లను నిర్మించిన స్థలాలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిందని చెబుతున్నా వినిపించుకోకుండా ఇళ్లను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామాల్లో ఉండే ప్రజలకు హైడ్రా భయం పట్టుకుంది.
న్యూస్ లైన్ డెస్క్: చెరువుల సంరక్షణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషన్ ఏర్పాటు చేసి పేదల ఇళ్లను కూడా కూల్చేస్తున్నారు. ఇప్పటికే చెరువులు వాటి స్థలాల్లో అక్రమంగా నిర్మించిన పలువురు బడా నేతలకు సంబంధించిన కట్టడాలకు హైడ్రా అధికారులు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. మొదట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే జరిగిన హైడ్రా కూల్చివేతలు క్రమంగా జిల్లాల్లో కూడా మొదలయ్యాయి.
ఇప్పటికే మహబూబ్‌నగర్ క్రిష్టియన్‌పల్లిలో పేదల ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. రాత్రి రాత్రి ఇళ్లను కూల్చేయడంతో రోడ్డున పడ్డామని వారు వాపోయారు. ఆ ఇళ్లను నిర్మించిన స్థలాలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిందని చెబుతున్నా వినిపించుకోకుండా ఇళ్లను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామాల్లో ఉండే ప్రజలకు హైడ్రా భయం పట్టుకుంది.
ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు తన ఇంటిని కూల్చేస్తారనే భయంతో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు ఆందోళన చెందుతున్న విషయం మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డికి తెలిసింది. దీంతో తన ఇంటిని కూల్చేయకుండా చూసుకుంటానని వృద్ధురాలికి సబితా ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. తనకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇంటిని కూల్చేయవద్దని హైడ్రా అధికారులతో మాట్లాడుతానని ఆమె అన్నారు.
అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాస్తానని వెల్లడించారు. ఇంటిని అధికారులు కూల్చేస్తారనే బెంగ పెట్టుకోవద్దని ఆమె వృద్ధురాలికి సూచించారు. చెరువులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో దాదాపు ఐదు వేల పేదల ఇళ్లు ఉన్నాయని, అక్కడ కూల్చివేతలను ఆపేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తానని సబితా భరోసా ఇచ్చారు.