సౌండ్ పొల్యూషన్‌కి కారణమవుతున్న బైక్‌లను సంగారెడ్డి పోలీసుల గుర్తించారు.
న్యూస్ లైన్ డెస్క్: సౌండ్ పొల్యూషన్‌కి కారణమవుతున్న బైక్‌లను సంగారెడ్డి పోలీసుల గుర్తించారు. సైలెన్సర్ల భారీ శబ్ధంతో రోడ్డు మీదకి వచ్చి జనాలను ఇబ్బంది పెడుతున్న 70 బైకులను పోలీసులు సీజ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సైలెన్సర్లను జిల్లా ఎస్పీ రూపేష్ రోడ్డు రోలర్‌తో తొక్కించారు. బైక్‌ల సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్ కేసులు ఉంటాయని, వాహనదారులకు ఎస్పీ రూపేష్ వార్నింగ్ ఇచ్చారు. కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వాడాలని సూచించారు. సైలెన్సర్లు మార్చిన మెకానిక్ లపై కూడా క్రిమినల్ కేసులు పెడతామని ఎస్పీ స్పష్టం చేశారు.