sarpanch: గవర్నర్ వద్దకు సర్పంచ్‌ల సంఘం

గత 6 నెలలుగా గ్రామాలకు రావాల్సిన బిల్లులు చెల్లించలేదని వెల్లడించారు. బిల్లుల చెల్లింపు ఆలస్యం కావడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గ్రామాల్లో వైకుంఠ దామాలు మొదలుకొని సీ.సీ రోడ్ల వరకు అన్ని పనులు నిలిచిపోయాయని వాపోయారు. గత 6 నెలలుగా గ్రామాలకు రావాల్సిన బిల్లులు చెల్లించలేదని వెల్లడించారు. బిల్లుల చెల్లింపు ఆలస్యం కావడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గ్రామాల్లో వైకుంఠ దామాలు మొదలుకొని సీ.సీ రోడ్ల వరకు అన్ని పనులు నిలిచిపోయాయని వాపోయారు. 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-06-30/1719728573_Untitleddesign45.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్(congress) అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు గ్రామాలకు నిధులు మంజూరు కాలేదు. దీంతో ప్రజలకు కావలసిన అవసరాలను తీర్చడం, గ్రామాల్లో పునర్నిర్మాణ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడం సర్పంచ్‌(sarpanch)లకు కష్టతరంగా మారింది. దీంతో ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ రాధాకృష్ణ(Radhakrishna)ను ఆశ్రయించాలని సర్పంచ్‌లు నిర్ణయించారు. ఈ మేరకే ఆదివారం ఉదయం రాజ్‌భవన్‌(Raj bhavan)లో గవర్నర్ రాధాకృష్ణను సర్పంచ్‌ల సంఘం నాయకులు కలిశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి గ్రామాల(villages)కు మంజూరు కాని నిధులపై వినతి పత్రం అందించారు. గత 6 నెలలుగా గ్రామాలకు రావాల్సిన బిల్లులు చెల్లించలేదని వెల్లడించారు. బిల్లుల చెల్లింపు ఆలస్యం కావడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గ్రామాల్లో వైకుంఠ దామాలు మొదలుకొని సీ.సీ రోడ్ల వరకు అన్ని పనులు నిలిచిపోయాయని వాపోయారు. 

ఈ అంశంపై ఇప్పటికే సీఎం, రేవంత్ రెడ్డికి వినతి అందించామని, అయినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని గవర్నర్ రాధాకృష్ణకు రాసిన వినతి పత్రంలో తెలిపారు. గ్రామాలకు పెండింగ్ బిల్లులు వచ్చే విధంగా  చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ల సంఘం నాయకులు కోరారు. 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news newslinetelugu brs congress telanganam cm-revanth-reddy congress-government villages raj-bhavan radhakrishna sarpanch governor

Related Articles