గుడ్డు నుంచి ఎక్కువగా కోడి పిల్లలు బయటకు రావడం మనం ఇప్పటివరకు చూసాం. కానీ గుడ్డు నుంచి ఒక పాము పిల్ల బయటకు వచ్చి, ఈ వాతావరణంలో బ్రతకడానికి ఎలా ప్రయత్నం చేస్తుందో ఈ
న్యూస్ లైన్ డెస్క్: గుడ్డు నుంచి ఎక్కువగా కోడి పిల్లలు బయటకు రావడం మనం ఇప్పటివరకు చూసాం. కానీ గుడ్డు నుంచి ఒక పాము పిల్ల బయటకు వచ్చి, ఈ వాతావరణంలో బ్రతకడానికి ఎలా ప్రయత్నం చేస్తుందో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఒక వ్యక్తి తన చేతిలో గుడ్డును పట్టుకొని ఉన్నాడు. ఈ గుడ్డు నుండి కింగ్ కోబ్రా పిల్ల అప్పుడే బయటకు వచ్చింది.
ఈ చిన్న పాము గుడ్డు నుంచి బయటకు వస్తూ తన నాలుకను వేగంగా కదిలిస్తోంది. అప్పుడే బయటకు వచ్చింది కాబట్టి దాని శరీరం వణుకుతోంది. సాధారణంగా ఈ కోబ్రా నాగుపాము 18 అడుగుల పొడవు వరకు పెరుగుతాయట. ఇది చాలా ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉంటాయి. దీని విషం ఒక ఏనుగును కూడా చంపగలదు. అలాంటి కింగ్ కోబ్రా పిల్ల గుడ్డు నుంచి బయటకు వస్తున్నటువంటి వీడియో నెట్టింటా చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు. లక్షలాదిమంది లైక్ కొట్టారు. అద్భుతమైన వీడియో, ఇది ఇప్పుడే ఇలా ఉంటే ఇంకెంత పొడవు అవుతుందో అంటూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ప్రస్తుతం ఇండియాలోని సర్పాలలో ఇది అత్యంత విషపూరితమైనదంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు కూడా ఈ వీడియో చూసి కామెంట్స్ ఏంటో చెప్పండి.