బస్సులు నడవక కాలినడకన, సైకిళ్లు, ఆటోల్లో విద్యార్థులు బడికి పోతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: బస్సులు నడవక కాలినడకన, సైకిళ్లు, ఆటోల్లో విద్యార్థులు బడికి పోతున్నారు. నిర్మల్ జిల్లాలో అనేక గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపడపోవడంతో విద్యార్థులు సమీప గ్రామాల్లోని పాఠశాలలకు కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కొంతమంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రమాదమని తెలిసినా ఆటోల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. కూర్చోవడానికి స్థలం లేక ఆటోల వెనుక నిలబడి వెళ్తున్నారు.
రవాణా సౌకర్యం లేక తమ పిల్లల బాధలు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అదునుగా చూసి ప్రైవేట్ పాఠశాలలు ఊరూరా తమ బస్సులను నడుపుతూ విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్చుకుంటున్నాయి. దీనికి ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. దీనిపై ప్రభుత్వం స్పందించి బస్సులు నడపాలని విద్యార్థుల తల్లదండ్రులు కోరుకుంటున్నారు.