అన్న రామన్న.. ఆనాటి నవ్వులు ఏవన్నా.. నా పించిని.. వస్తలేదన్న.. అంటూ సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్‌తో తన పరిస్థితిని పాట రూపంలో తెలియజేయడంతో అక్కడ నవ్వులు విరబూశాయి.
న్యూస్ లైన్ డెస్క్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సిరిసిల్లలో వారి విగ్రహనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అయితే ఈ క్రమంలో ఓ వ్యక్తి అన్న రామన్న.. ఆనాటి నవ్వులు ఏవన్నా.. నా పించిని.. వస్తలేదన్న.. అంటూ సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్‌తో తన పరిస్థితిని పాట రూపంలో తెలియజేయడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. ఇక కేటీఆర్‌ను కలుస్తాడు.. కేటీఆర్ ఆ వ్యక్తితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ పింఛన్ ఎత్తుకు పోయినట్లు ఉన్నడు అంటూ సమాధానం ఇస్తారు. ఆ వ్యక్తిని దగ్గర పిలుచుకోని నీకు పింఛన్ ఇప్పించే బాధ్యత నాది అని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆ వ్యక్తితో ఫోటో దిగి అక్కడి నుంచి కేటీఆర్ చిరునవ్వుతో వెళ్లిపోతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతుంది.
అన్నా రామన్న అన్నా రామన్న
ఆనాటి నవ్వులుఏవన్నా మా రామన్న
నా పింఛన్ వస్తలేదన్న అంటూ సిరిసిల్ల పర్యటనలో @KTRBRS తో తన పరిస్థితిని పాట రూపంలో తెలియజేయడం తో అక్కడ నవ్వులు విరబూశాయి pic.twitter.com/5vuuALS6OT — KMR@KTR (@kmr_ktr) August 18, 2024