Sitarama project: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్

న్యూస్ లైన్, ఖమ్మం : సీతారామ ప్రాజెక్ట్ మోటర్ల ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయనిగా ఉన్న ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 17వేల కోట్ల అంచనాతో నిర్మించారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని దాదాపు 10లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో దీన్ని నిర్మించారు. కేసీఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తి అయ్యింది. దీంతో మోటార్ల ట్రయల్ రన్ నిర్వహించారు. అది సక్సెస్ కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-06-27/1719470181_301b9c6fd5914cd5815b990d7ed293cd.jfif

న్యూస్ లైన్, ఖమ్మం : సీతారామ ప్రాజెక్ట్ మోటర్ల ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయనిగా ఉన్న ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 17వేల కోట్ల అంచనాతో నిర్మించారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని దాదాపు 10లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో దీన్ని నిర్మించారు. కేసీఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తి అయ్యింది. దీంతో మోటార్ల ట్రయల్ రన్ నిర్వహించారు. అది సక్సెస్ కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి సీతారామ ఎత్తిపోతలతో మోటార్ల ద్వారా ఆ నీటిని వైరాకు పంపుతారు. వైరా రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్ కాల్వ ద్వారా సత్తుపల్లి వరకు కూడా సాగునీటిని అందించనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15 వరకు సాగర్ లింక్ కెనాల్ కు అనుసంధానం చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా  కొంత కాల్వలు పూర్తి చేయాల్సి ఉంది. వీటినిపైనా అధికారులు దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : kcr revanth-reddy nagarjuna-sagar sitarama-project vaira-reservoir

Related Articles