Snakes: కొన్ని జాతుల పాములు రైతులను కాపాడతాయని తెలుసా?

చిన్న చిన్న కన్నాల్లో నక్కి ఉంటాయి. కాని వీటిలో కొన్ని బురదపాములుంటాయి. కాని కొన్ని మాత్రం విషపూరితమైనవి. అయితే కొన్ని జాతుల పాములు మాత్రం రైతులను కాపాడతాయని చాలా తక్కువ మందికే తెలుసు.


Published Aug 02, 2024 07:16:39 AM
postImages/2024-08-02/1722597914_DHAMAN.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఓ వైపు వర్షాలు ..మరో వైపు పాములు ...రైతులకు వర్షాకాలం చాలా కష్టమైన కాలం. పాములు ..నేలమీద కనిపించవు..చిన్న చిన్న కన్నాల్లో నక్కి ఉంటాయి. కాని వీటిలో కొన్ని బురదపాములుంటాయి. కాని కొన్ని మాత్రం విషపూరితమైనవి. అయితే కొన్ని జాతుల పాములు మాత్రం రైతులను కాపాడతాయని చాలా తక్కువ మందికే తెలుసు.


జార్ఖండ్‌లోని పాలము జిల్లా విషపూరితమైన నాగుపాము, క్రైట్ , చెవిటి పాములకు నిలయం. ఇది న్యూరోటాక్సిన్స్ అని పిలువబడే కోబ్రాస్ , క్రైట్‌లను కలిగి ఉంటుంది. ఈ పాములలో ఒకటి ధమన్ పాము, ఈ  ధమన్‌ పామును ఎలుక పాము అంటారు, ఇది తన జీవితకాలంలో 25 వేల ఎలుకలను తింటుందంట. పంట ఎలుకల పాలు కాకుండా ఈ పాము కాపాలా కాస్తూ ఉంటుంది. అంతేకాదు ..ధమన్ పాము ..రైతు కంటపడితే అదృష్టమని కూడా అంటారు.


ఇవి ఆవు పాలను ఫిల్టర్ చేసి తాగుతాయి, ఇది పాములకు పాలను జీర్ణం చేయడానికి అవసరమైన రసాయనాలు ఉండవు అనే అపోహ మాత్రమేఈ పాములు రైతులకు వరం కంటే తక్కువ కాదని నిపుణుడు అన్నారు. ఈ పాము రైతు చాలా మేలు చేస్తుంది. అయితే రైతులు చాలా మందికి ఈ ధమన్ పాము గురించి తెలుసని ...వీటిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు. పొలాలకు మందులు చల్లుతూ చాలా వరకు ఈ పాములను చంపేస్తున్నారని వెల్లడించారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu farmers rains snakes

Related Articles