Mothilal: ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష విరమించిన మోతీలాల్

నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌ నాయక్‌ నిరాహార దీక్ష విరమించారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-02/1719898393_mothilal.jfif

న్యూస్ లైన్ డెస్క్: నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌ నాయక్‌ నిరాహార దీక్ష విరమించారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం దాదాపు 9 రోజులుగా గాంధీ ఆస్పత్రిలో దీక్ష చేసిన మోతీలాల్‌ ఎట్టకేలకు దీక్ష విరమించి నిమ్మరసం సేవించారు. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రి వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నానని, ఈ తొమ్మిది రోజుల్లో ఒక్క ఉద్యోగం పెరగలేదని అన్నారు.

అన్న పానియాలు లేకుండా ఆమరణ దీక్ష చేస్తున్నానని, ఆరోగ్యం సరిలేకపోవడంతో దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు. దీక్ష చేయడం వల్ల కిడ్నీ, లివర్లు పనిచేయని పరిస్థితికి వచ్చిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని వాపోయారు. 25 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. ‘గ్రూపు1 1:100 శాతం చేయాలి, గ్రూపు 2, గ్రూపు 3 ఉద్యోగాలు పెంచాలి, డీఎస్సీ రద్దుచేసి మెగా డీఎస్సీ ప్రకటించాలని’ మోతీ లాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana student motilal-nayak

Related Articles