ఎల్లుండి స్కూళ్లు, కాలేజీల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు.
న్యూస్ లైన్ డెస్క్: ఎల్లుండి స్కూళ్లు, కాలేజీల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు. నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని ఎస్‌ఐఎఫ్, పీడీఎస్‌యూ, ఎఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌వో, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని, దీనిపై పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించి న్యాయం చేయాలని కోరాయి. పేపర్ లీకేజీలతో విద్యార్థులు నష్టపోయారని తెలిపాయి.